అరటి.. మన ఆరోగ్యానికి ఎంతో మేలు(Good For Health) చేస్తుంది. మంచి ఆహారం(Food)గా, రోగాల(Diseases)కు మందుగా ఉపయోగపడుతుంది. బనానా తింటే మోషన్స్(Diarrhea) తగ్గుతాయి. ఇందులో పిండిపదార్థం(Starch) గట్టిగా ఉండటం వల్ల చిన్న పేగులు దీన్ని త్వరగా గ్రహించలేవు. ఇది మంచి బ్యాక్టీరియా(Bacteria)లకు ఫుడ్ మాదిరిగా పనికొస్తుంది. చెడు బ్యాక్టీరియాను శరీరం నుంచి బయటికి పంపిస్తుంది. అరటిలో పొటాషియం(Potassium) వంటి ఎలక్ట్రోలైట్లు (Electrolytes) పుష్కలంగా ఉంటాయి. మోషన్స్ (విరేచనాల) వల్ల కోల్పోయిన ఎలక్ట్రోలైట్లను బనానా భర్తీ చేస్తుంది. వ్యాధులను పూర్తిగా నయం చేయలేకపోవచ్చు. కానీ.. రోగ లక్షణాల తీవ్రతను తగ్గిస్తుంది.
- Advertisement -
