Saturday, May 16, 2026
Homeక్రైమ్ వార్తలుAtrocity | ఇంటి యజమానితో దుర్మార్గపు ఒప్పొందం..

Atrocity | ఇంటి యజమానితో దుర్మార్గపు ఒప్పొందం..

  • ఆర్ధిక ఇబ్బందుల వల్ల కిరాతక చర్య..
  • ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు..

ఆర్థిక ఇబ్బందుల వల్ల ఒక వ్యక్తి ఇంటి కిరాయి చెల్లించలేకపోయాడు. అద్దె బకాయిలు పేరుకుపోవడంతో వాటి మాఫీ కోసం ఇంటి యజమానితో ఒప్పందం చేసుకున్నాడు. తన భార్య, కుమార్తెపై ఇంటి ఓనర్‌ అత్యాచారానికి అతడు అనుమతించాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు, ఆ వ్యక్తితో పాటు ఇంటి యజమానిని అరెస్ట్‌ చేశారు. గుజరాత్‌లోని సురేంద్రనగర్‌కు చెందిన ఒక కుటుంబం జీవనోపాధి కోసం ఆరు నెలల కిందట మోర్బికి వలస వచ్చింది.

నెలకు రూ. 2,000 కిరాయికి ఒక అద్దె ఇంట్లో వారు నివసిస్తున్నారు. కాగా, ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆ వ్యక్తి నాలుగు నెలలుగా ఇంటి కిరాయి చెల్లించలేదు. దీంతో అద్దె బకాయిలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఇంటి కిరాయి బకాయిల మాఫీ కోసం ఓనర్‌తో అతడు ఒప్పందం చేసుకున్నాడు. తన భార్య, మైనర్‌ కుమార్తెపై అత్యాచారం చేసేందుకు ఇంటి యజమానికి అనుమతి ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఆ మహిళ, ఆమె కుమార్తెపై ఆ ఇంటి ఓనర్‌ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు.

- Advertisement -

మరోవైపు ఆ వ్యక్తి భార్య తల్లికి ఈ విషయం తెలిసింది. దీంతో మోర్బి పోలీస్ స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో పోక్సో చట్టంతో సహా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ వ్యక్తిని, ఇంటి ఓనర్‌ను అరెస్ట్‌ చేశారు. ఈ నేరంలో ప్రమేయం ఉన్న మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీస్‌ అధికారి తెలిపారు. అతడి కోసం వెతుకుతున్నట్లు వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News