భారత ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగా, GST పన్ను రేట్ లను పునరుద్ధరిస్తూ కొత్త రేట్ లు తీసుకొచ్చారు. ఈ కొత్త రేట్ లు సోమవారం నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. ఈ కొత్త రేట్ లు వల్ల దాదాపు 375 ఉత్పత్తులపై పన్నులు గణనీయంగా తగ్గాయి.
పెరిగిన రేట్ లు ప్రకారం, పాలు, ప్యాకేజ్డ్ పనీర్, చపాతీలు, పరోటాల వంటి 50కి పైగా వస్తువులు ఇకపై సున్నా పన్ను పరిధిలోకి వస్తాయి. క్యాన్సర్ మరియు అరుదైన వ్యాధులకు చికిత్స కోసం ఉపయోగించే 33 అత్యవసర మందులు మరియు చికిత్సలకు GST నుంచి పూర్తిగా మినహాయింపు లభించింది. ఇతర మందులపై పన్ను 12 శాతం నుంచి సున్నాకు తగ్గింది. డయాగ్నోస్టిక్ కిట్లు, గ్లూకోమీటర్ల వంటి వైద్య పరికరాలపై GST 5 శాతానికి తగ్గింది.
పాఠశాలలు, కార్యాలయాలలో ఉపయోగించే ఎరేజర్లు, పెన్సిళ్లు, నోట్ బుక్స్ వంటి స్టేషనరీ వస్తువులపై పన్ను పూర్తిగా తొలగించారు. వెన్న, బిస్కెట్లు, కండెన్స్డ్ మిల్క్, జామ్ , కెచప్, డ్రై ఫ్రూట్స్, నెయ్యి, ఐస్ క్రీమ్ వంటి అనేక వినియోగ పదార్ధాల ధరలు తగ్గనున్నాయి. బాదం, జీడిపప్పు, పిస్తా, ఖర్జూరాల వంటి డ్రై ఫ్రూట్స్, గింజలపై పన్ను 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గింది.
ఇక గృహ నిర్మాణంలో ఉపయోగించే సిమెంట్ పై GST 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గింది. హెయిర్ కట్, సలోన్ ట్రీట్మెంట్లు, యోగా క్లాసులు, జిమ్ లు, హెల్త్ క్లబ్ లు వంటి సేవలపై కూడా పన్ను రేట్లు తగ్గాయి.
అదనంగా, సబ్బులు, షాంపూలు, హెయిర్ ఆయిల్, ఫేస్ క్రీమ్స్, షేవింగ్ క్రీమ్ లు వంటి టాయిలెట్రీస్ కూడా సున్నా పన్ను కేటగిరీలో చేరాయి. ఎయిర్ కండీషనర్లు, టెలివిజన్లు, వాషింగ్ మెషీన్లు, డిష్ వాషర్ ల వంటి పరికరాలపై GST 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గింది.
సిగరెట్లు, బీడీలు, పాన్ మసాలా, గుట్కా మరియు ఇతర పొగాకు ఉత్పత్తులతో పాటు కోకా-కోలా, పెప్సీ, ఫాంటా వంటి శీతల పానీయాలపై పన్ను రేటు పెరగనుంది.
1,200 సీసీ (పెట్రోల్) లేదా 1,500 సీసీ (డీజిల్) కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం మరియు 4 మీటర్ల కంటే ఎక్కువ పొడవు ఉన్న పెద్ద స్పోర్ట్-యూటిలిటీ వాహనాలు(SUV) మరియు మల్టీపర్పస్ వాహనాలపై మునుపు ఉన్న 28 శాతం ప్లస్ 22 శాతం సెస్ కు బదులుగా ఇప్పుడు 40 శాతం పన్ను విధించబడుతుంది.