ఎల్ అండ్ టీ సంస్థ ప్రెసిడెంట్, హోల్‌టైమ్ డైరెక్టర్ శంకర్ కీలక ప్రకటన
హైదరాబాద్ మెట్రో రైల్(Hyderabad Metro Rail)ను రాష్ట్ర ప్రభుత్వం టేకోవర్ చేసుకుంటున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. అయితే ఈ ప్రక్రియ ఎప్పటికల్లా పూర్తవుతుందనే విషయంలో తాజాగా ఎల్ అండ్ టీ సంస్థ ప్రెసిడెంట్, హోల్‌టైమ్ డైరెక్టర్ శంకర్ కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ నుంచి పెట్టుబడుల (Investments) ఉపసంహరణ ప్రస్తుత త్రైమాసికం(Quarter)లో గానీ వచ్చే త్రైమాసికం మధ్యలో గానీ ఎప్పుడైనా పూర్తికావొచ్చని శంకర్ పేర్కొన్నారు. ఎల్ అండ్ టీ క్యూ2(Q2) ఫలితాల అనంతరం ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ లావాదేవీ(Transaction)కి సంబంధించిన పత్రాల (Documents) విషయంలో కొన్ని లోపాలు (Mistakes) జరిగి ఉండొచ్చని, అందుకే వచ్చే త్రైమాసికం నాటికి పూర్తికావొచ్చని స్పష్టం చేశారు. ఇది ఎంత తొందరగా పూర్తయితే అంత మంచిదని అభిప్రాయపడ్డారు. అయితే ఈ గడువు (Deadline) పొడిగింపులో తాము ఒక్కరమే భాగం కాదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పారు. ఎల్ అండ్ టీ సంస్థ క్యూ2లో కన్సాలిడేటెడ్‌గా 3 వేల 926 కోట్లకు పైగా లాభం ఆర్జించింది. గతేడాది ఇదే సమయంతో పోల్చితే లాభం 15 పాయింట్ 6 శాతం పెరిగింది.
