రోడ్లు, భవనాల శాఖ మంత్రి (R & B Minister) కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) చిన్న కాంట్రాక్టర్ల(Contractors)కు గుడ్ న్యూస్ చెప్పారు. సీఎం రేవంత్(CM Revanth)తో మాట్లాడి రూ.100 కోట్ల పెండింగ్ బిల్లుల(Pending Bills)ను విడుదల చేసినట్లు ప్రకటించారు. మిగిలిన రూ.50 కోట్ల పెండింగ్ బిల్లులను సైతం త్వరలోనే చెల్లిస్తామని స్పష్టం చేశారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న బిల్లులను మంజూరుచేసిన సీఎం రేవంత్‌కి, మంత్రికి స్టేట్ బిల్డర్స్ అసోసియేషన్ (State Builders Association) ధన్యవాదాలు తెలిపింది.
