జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి(Gadwal Vijayalakshmi).. సీఎం రేవంత్ రెడ్డి(CM RevanthReddy)ని మర్యాదపూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం ఇంటికి శనివారం వెళ్లిన మేయర్.. ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు(New Year Wishes) తెలిపారు.
ఫూలేకి నివాళులు
మహిళా శక్తికి ప్రతీక సావిత్రిబాయి ఫూలే(Savitribai Phule) అని మేయర్ విజయలక్ష్మి అన్నారు. దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి జయంతి (Jayanti)ని పురస్కరించుకొని ఫిల్మ్ నగర్‌లో ఉన్న ఫూలే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు(Tributes) అర్పించారు. మహిళల విద్య కోసం సావిత్రిబాయి ఎనలేని సేవలు అందించారని చెప్పారు. విద్యే ఆయుధంగా సమానత్వం కోసం పోరాడినవారి జీవితం అందరికీ మార్గదర్శకమని తెలిపారు.

సావిత్రిబాయి పూలే ఆశయాల సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. మహిళల విద్య కోసం సావిత్రీబాయి ఫూలే చేసిన అపారమైన కృషిని గుర్తించి ఆమె జయంతి(జనవరి 3వ తేదీ)ని మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం హర్షణీయమని మేయర్ అన్నారు.
