- జీహెచ్ఎంసీలో 32 మందికి కారుణ్య నియామక పత్రాలు అందజేత
- జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
ప్రజలకు ఉత్తమ సేవలను అందించడం ద్వారా జీహెచ్ఎంసీకి, ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. కష్టపడి బాగా పనిచేయాలని నూతనగా ఉద్యోగాలకు సూచించారు. జీహెచ్ఎంసీలోని వివిధ విభాగాల్లో పనిచేస్తూ.. మృతి చెందిన ఉద్యోగుల వారసులు 32 మందికి కారుణ్య నియామకాల క్రింద జీహెచ్ఎంసీ ఉద్యోగాలు కల్పించింది. వీరికి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సోమవారం సాయంత్రం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నియామక పత్రాలను అందించారు. 32 మందిలో 10 మంది జూనియర్ అసిస్టెంట్ లు గా, 17 మంది ఆఫీస్ సబార్డినెట్ లుగా, 5 మంది పబ్లిక్ హెల్త్ వర్కర్ లుగా వివిధ విభాగాల్లో పోస్టింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ… మీకు మంచి భవిష్యత్తు ఉంది. సానుకూల దృక్పథం తో , ఫిర్యాదులు లేకుండా ఉత్తమ పనితీరు కనబరచాన్నారు. విధి నిర్వహణలో సమయ పాలన తప్పనిసరిగా పాటించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ వేణు గోపాల్ తదితరులు ఉన్నారు.










