Wednesday, March 25, 2026
Homeహైదరాబాద్‌Inspection | OU పోలీస్ స్టేషన్ పరిధిలో సమస్యలపై తనిఖీ

Inspection | OU పోలీస్ స్టేషన్ పరిధిలో సమస్యలపై తనిఖీ

  • డిప్యూటీ మేయర్ ఆకస్మిక తనిఖీ
  • పారిశుద్ధ్యం,వీధి దీపాలు, రోడ్ల అభివృద్ధికి హామీ

ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో నెలకొన్న పలు మౌలిక వసతుల సమస్యలపై గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి శనివారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.ఈ తనిఖీలో పారిశుద్ధ్య లోపాలు,పనిచేయని వీధి దీపాలు,దయనీయ స్థితిలో ఉన్న రోడ్ల పరిస్థితిని ఆమె ప్రత్యక్షంగా పరిశీలించారు.పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రజలకు సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఏసీపీ జగన్,సీఐ అప్పలనాయుడు డిప్యూటీ మేయర్ దృష్టికి తీసుకువచ్చారు.

ముఖ్యంగా శుభ్రత లోపం,వెలుతురు సమస్యలు, రోడ్ల గుంతల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు వారు వివరించారు.పోలీసు అధికారుల ఫిర్యాదులపై వెంటనే స్పందించిన డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి,సంబంధిత జీహెచ్‌ఎంసీ అధికారులు,ఉస్మానియా యూనివర్సిటీ అధికారులతో అక్కడికక్కడే చర్చలు జరిపారు.సమస్యలను గుర్తించి పరిష్కార దిశగా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

- Advertisement -

పోలీస్ స్టేషన్ పరిధిలో పారిశుద్ధ్య పనులను మెరుగుపరచడంతో పాటు,పనిచేయని వీధి దీపాలను వెంటనే మరమ్మతులు చేయాలని,దెబ్బతిన్న రోడ్ల అభివృద్ధి పనులు త్వరితగతిన చేపట్టాలని డిప్యూటీ మేయర్ హామీ ఇచ్చారు.ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని పనులు సమన్వయంతో పూర్తి చేయాలని ఆమె సూచించారు.ఈ తనిఖీలో డిప్యూటీ మేయర్ వెంట టిటియుసి రాష్ట్ర అధ్యక్షులు మోతే శోభన్ రెడ్డి,పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News