Friday, October 3, 2025
ePaper
Homeతెలంగాణఅదనపు న్యాయమూర్తులుగా నలుగురు జడ్జిలు ప్రమాణస్వీకారం

అదనపు న్యాయమూర్తులుగా నలుగురు జడ్జిలు ప్రమాణస్వీకారం

తెలంగాణ హైకోర్టుకు కొత్తగా నియమితులైన నలుగురు అదనపు న్యాయమూర్తులు(Judges) ప్రమాణస్వీకారం చేశారు. జస్టిస్‌ రేణుకా యారా, జస్టిస్‌ నందికొండ నర్సింగ్‌రావు, జస్టిస్‌ ఇ.తిరుమలదేవి, జస్టిస్‌ బి.ఆర్‌.మధుసూదన్‌రావుతో హైకోర్టు సీజే జస్టిస్‌ సుజయ్‌ పాల్‌ ప్రమాణం చేయించారు. ఇంతకుముందు రేణుక యారా సిటీ సివిల్‌ కోర్టు చీఫ్‌ జడ్జిగా, నందికొండ నర్సింగ్‌రావు సిటీ స్మాల్‌ కాజెస్‌ కోర్టు చీఫ్‌ జడ్జిగా, ఇ.తిరుమలాదేవి హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌, విజిలెన్స్‌ రిజిస్ట్రార్‌గా, బి.ఆర్‌.మధుసూదన్‌రావు హైకోర్టు రిజిస్ట్రార్‌(పరిపాలన)గా బాధ్యతలు నిర్వర్తించారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News