పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ విజయలక్ష్మి
లక్డికాపూల్ నుండి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకు 17.93 కోట్ల రూపాయల అంచనా వ్యయం తో వరద నీటిని తరలించే కాలువలకు హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మేయర్ గద్వాల విజయ లక్ష్మీ, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్,నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్, ఎమ్మెల్సీ మీర్జా రియాజ్ ఉల్ అసన్ ఎఫండీ , జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్న ప్రభాకర్ మాట్లాడుతూ.. వరదనీటి కాలువల పనులను త్వరితగతిన ప్రారంభించి పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజా పాలన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో నగర అభివృద్ధి వేగవంతంగా కొనసాగుతోందని తెలిపారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను మరింతగా పెంచేందుకు రోడ్లు, నాళాలు, డ్రైనేజీ వ్యవస్థల ఆధునీకరణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన వెల్లడించారు. ఈ క్రమంలో భారీ ఎత్తున నిధులు కేటాయించామని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి స్పష్టం చేశారు.