Tuesday, February 10, 2026
Homeమహబూబ్‌నగర్‌Tribute | తొలి అమరుడు శ్రీకాంతచారి కి నివాళులు

Tribute | తొలి అమరుడు శ్రీకాంతచారి కి నివాళులు

  • మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగం చేసిన కాసోజు శ్రీకాంత చారి కి నివాళులు అర్పించారు. బుధవారం శ్రీకాంత చారి వర్ధంతి సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తన స్వగృహంలో బిఆర్ఎస్ నాయకులతో కలిసి శ్రీకాంత చారి చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ.. కెసిఆర్ దీక్షను భగ్నం చేస్తూ తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చడానికి ఆనాటి ప్రభుత్వ కుట్రలను నిరసిస్తూ కేసీఆర్ కు మద్దతుగా ఆత్మార్పణ చేసుకున్న మొట్టమొదటి తెలంగాణ ఉద్యమకారుడు శ్రీకాంత చారి అని కొనియాగారు.

శ్రీకాంత చారి మరణంతో తెలంగాణ ఉద్యమం కెసిఆర్ నాయకత్వంలో విద్యార్థి లోకం ఉవ్వెత్తున ఎగిసిపడి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు. సూర్యచంద్రులు ఉన్నంతవరకు తెలంగాణ చరిత్రలో శ్రీకాంతా చారి పేరు చరిత్రలో నిలుస్తుందని అన్నారు. అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, మార్క్ ఫెడ్ డైరెక్టర్ విజయకుమార్, మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్, మండల పార్టీ అధ్యక్షులు కే మాణిక్యం, న్యాయవాదులు వెంకటరామిరెడ్డి, అనంతరెడ్డి, మాజీ కౌన్సిలర్ లు ఆవుల రమేష్, పెండెం నాగన్న యాదవ్, కంచ రవి, ప్రేమ్ నాథ్ రెడ్డి, స్టార్ రహీం నాయకులు ఇమ్రాన్, జోహేబ్ హుస్సేన్, చిట్యాల రాము, మంద రాము, హరీఫ్ పాషా, ఏకే పాషా, అనపటి రాములు తదితరులు నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News