Sunday, April 12, 2026
Homeమహబూబ్‌నగర్‌Honour | బిఆర్ఎస్ ఏకగ్రీవ సర్పంచ్ ను సన్మానించిన మాజీ మంత్రి

Honour | బిఆర్ఎస్ ఏకగ్రీవ సర్పంచ్ ను సన్మానించిన మాజీ మంత్రి

బిఆర్ఎస్ పార్టీ ఏకగ్రీవ సర్పంచ్ ను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదివారం సన్మానించారు. వివరాల్లోకి వెళితే గోపాల్ పేట మండలం లక్ష్మీదేవి పల్లి గ్రామంలో భారత రాష్ట్ర సమితి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బంగారయ్య, వార్డు సభ్యులుగా గుంటి లక్ష్మయ్య, గుంటి అయోధ్య రాములు, వెంకటయ్యలు ఏకగ్రీవం అయ్యారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తన వ్యవసాయ క్షేత్రంలో వారిని సన్మానించారు. అనంతరం మాజీ మంత్రి మాట్లాడుతూ.. సర్పంచ్ గా ఎన్నికై పార్టీ ప్రతిష్ట పెంచారని రాబోవు కాలంలో గ్రామ అభివృద్ధికి తాను తోడ్పడుతానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో రైతు సమితి అధ్యక్షులు తిరుపతయ్య, మాజీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES

Latest News