బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవి ప్రసాద్ గౌడ్
అమావాస్యను పురస్కరించుకొని బౌద్ధ నగర్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బెల్దే రవికుమార్ గుప్త ఆధ్వర్యంలో అంబర్ నగర్ మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఆదివారం మధ్యాహ్నం పెద్ద ఎత్తున అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవి ప్రసాద్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవి ప్రసాద్ మాట్లాడుతూ.. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అనేకచోట్ల అమావాస్యను పురస్కరించుకొని అన్నదానాలు చేస్తూ వేల మంది పేద ప్రజల ఆకలి తీర్చుతున్నారని తెలిపారు. కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు పొందుతూ వైశ్యులంతా కూడా సేవాభావంతో శమించి ప్రజాసేవ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నందుకు వారిని అభినందిస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు జరిపించి స్థానిక ప్రజల యొక్క మన్నలను బౌద్ధ నగర్ ఆర్యవైశ్య సంఘం సభ్యులు పొందుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు ప్రొద్దుటూరు వెంకటేశ్వరరావు, పాలూరు సురేష్, పాలెం గోవిందరాజులు, సురేష్ కుమార్, బీజగం శ్రీనివాస్, అల్లాడి హరీష్ కుమార్, గుండా శ్రీనివాస్, గుప్తా భూశెట్టి శ్రీనివాస్, గుని శెట్టి వెంకటేష్, ప్రభాకర్ గుప్తా, బీజేపీ జాయింట్ కన్వీనర్ దత్తు తదితర సభ్యులు పాల్గొన్నారు.
