Tuesday, February 10, 2026
Homeమహబూబ్‌నగర్‌Propaganda | అభివృద్ధిని చూడలేక అసత్యపు ప్రచారాలు.

Propaganda | అభివృద్ధిని చూడలేక అసత్యపు ప్రచారాలు.

  • గత ప్రభుత్వంలోనే రిజర్వాయర్ కు 941 జీవో జారీ.
  • నేడు రిజర్వాయర్ పై బిఆర్ఎస్ స్వార్థ రాజకీయాలు.
  • విలేకరుల సమావేశంలో మంద సత్యశీలా రెడ్డి..

అభివృద్ధిని చూడలేకే అసత్యపు ప్రచారాలు చేస్తూ బి ఆర్ ఎస్ నాయకులు గొల్లపల్లి రిజర్వాయర్ పై నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారని ఉమ్మడి గోపాల్ పేట మండలాల ఇంచార్జ్ మంద సత్యశీలా రెడ్డి బి ఆర్ ఎస్ నాయకులపై మండిపడ్డారు. ఆదివారం గొల్లపల్లి రిజర్వాయర్ పై గొల్లపల్లి గ్రామపంచాయతీలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2016 లోని గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం గొల్లపల్లి రిజర్వాయర్ కొరకు 941 జీవో జారీ చేసి 2018 లో గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి మ్యాపింగ్ పూర్తి చేశారని .. కానీ ఆనాడు జీవో జారీచేసి ఇప్పుడు రిజర్వాయర్ వద్దని ధర్నాలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు.

గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోయే రైతులకు నష్టపరిహారం ఎకరాకు 6 లక్షల 50 వేలు నష్టపరిహారం చెల్లించేందుకు గత ఆనాటి బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించిందని గుర్తు చేశారు. గొల్లపల్లి రిజర్వాయర్ తో కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అసత్యపు, అబద్దాల ప్రచారాలతో రిజర్వాయర్ ను తప్పుదోవ పట్టిస్తు తెరచాటు రాజకీయం చేస్తున్నారని ఎద్దేవ చేశారు. 1100 కోట్లతో గొల్లపల్లి రిజర్వాయర నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని.. రిజర్వాయర్ లో భూములు కోల్పోయే రైతులకు 20 లక్షలకు పై నష్టపరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు.

- Advertisement -

రిజర్వాయర్ నిర్మాణంతో గొల్లపల్లి, చెన్నారం, చీర్కపల్లి గ్రామాలకు ఎటువంటి ఇబ్బంది ఉండదని.. రిజర్వాయర్ నిర్మాణంతో వనపర్తి జిల్లా సస్యశ్యామల కాబోతుందని ప్రజలు అసత్యపు ప్రచారాలు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. విలేకరుల సమావేశంలో గొల్లపల్లి గ్రామ సర్పంచ్ అనసూయ, చీర్కేపల్లి గ్రామ సర్పంచ్ రవి, పార్టీ నాయకులు భాస్కరరావు, శాంతయ్య, సురేష్ గౌడ్, శేఖర్ రావు, బండరాయి పాకుల సర్పంచ్ రాజు, ఉప సర్పంచ్ సుకుమార్ రెడ్డి, పాత తాండ గ్రామ సర్పంచ్ శ్రీను నాయక్, పార్టీ నాయకులు కొంకి వెంకటేష్, గౌండ్ల నరసింహ, ఏదుల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు సుఖేందర్ రెడ్డి, సురేందర్, రామచందర్, వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News