కవితపై నిరంజన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు (Telangana Jagruti President) కవిత(Kavitha)పై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నువ్వే లిక్కర్ రాణి’ అంటూ మండిపడ్డారు. నీళ్ల నిరంజన్ రెడ్డి అని ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. తనకు తానుగా నీళ్ల నిరంజన్ రెడ్డి అని పిలిపించుకోలేదని, అది ప్రజలు అభిమానంతో పిలుచుకునే పేరని ఆయన తెలిపారు. కావాలంటే ఆ పేరును విత్‌డ్రా చేసుకుంటానని అన్నారు. ‘నువ్వే.. లిక్కర్ రాణి’ అనే పేరుతో సంతోషంగా ఉండాలని ఎద్దేవా చేశారు. కేసీఆర్ (Kcr) కూతురు కాబట్టే కవితకు ఇంకా గౌరవం ఇస్తూ మాట్లాడుతున్నామని అన్నారు.
- Advertisement -
