నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి నయా స్కాంకు తెర లేపిన అక్రమార్కులు
- బోగస్ పత్రాలతో అధికారులను బురిడి కొట్టిస్తున్న వైనం
- నెక్కొండ మండలంలో చేస్తున్న భారీ భూ స్కాం..!
- 2019 సం.లోనే దేవాదాయ భూమిగా తేల్చిన సిసిఎన్ఏ
- 2020 సం.లో దొడ్డిదారిన చర్చి నిర్మాణం..
- అదే స్థలంలో 20 షెటర్ల నిర్మాణాలు.. లక్షల్లో కిరాయిలు
- నిద్రమత్తులో హిందూ సంఘాలు, దేవాదాయ శాఖ
రాష్ట్ర దేవాదాయ శాఖకు చెందిన భూమిలో చర్చి పేరుతో అక్రమ నిర్మాణాలు.. పంచాయితీ రాజ్ చట్టానికి నిస్సిగ్గుగా తూట్లు.. కమర్షియల్ షట్టర్లు వేసి లక్షల్లో వసూలు చేస్తున్న వైనం.. ఉలుకూ పలుకూ లేని అధికారులు.. హిందూ మత ధర్మం అణచివేయబడుతున్నా ఎవరికీ పట్టింపులేదు..
వరంగల్ జిల్లాలో వెలుగుచూసిన ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సష్టిస్తోంది.. దాదాపు 7 సంవత్సరాల నుంచి ఇంత దారుణం జరుగుతున్నా అటువైపు కన్నెత్తి చూడని దేవాదాయ శాఖ..అసలు తెలంగాణ రాష్ట్రంలో ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఉందా..? లేదా..?

వరంగల్ జిల్లా, నెక్కొండ మండలం, నెక్కొండ గ్రామ శివారులో రైల్వే స్టేషన్ కు అతి సమీపంలో వందల కోట్ల విలువైన దేవాదాయ శాఖ భూమిపై అక్రమార్కుల కన్ను పడింది.. ఇక అంతే దేవాదాయ శాఖ భూమిలో చర్చి పేరుతో 2020 సంవత్సరంలో అక్రమంగా నిర్మాణం చేసి కబ్జాకు తెర లేపారు అక్రమార్కులు.. ఇదే కాకుండా పంచాయతీరాజ్ చట్ట నిబంధనలు ఉల్లంఘించి, యదేచ్చగా కమర్షియల్ షెటర్లు 20 కి పైగా నిర్మించి, లీజుకు ఇచ్చి నిస్సిగ్గుగా లక్షలు దండుకుంటున్నారు.. నకిలీ డాక్యుమెంటు సృష్టించి, అధికారులను తప్పుదోవ పట్టిస్తూ.. దేవాదాయశాఖ ఆధీనంలో ఉన్న భూమిని కబ్జా చేస్తూ.. నయా స్కాంకు తెరలేపిన ముఠా చేస్తున్న వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది..
భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయ ఆదేశాలతో 2019 వ సం”లో ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ సునీత 3 3 2 1/620/2019, 32: 19-07-2019 0 లేఖ ద్వారా నాటి నెక్కొండ మండల తాహసిల్దార్ కు సర్వేనెంబర్ 66/1 లోని 4 ఎకరాల 27 గుంటల స్థలం దేవాదాయ శాఖ భూమిగా తెలియజేస్తూ లేఖ రాశారు అన్నది జగమెరిగిన సత్యం..
ఖాళీగా ఉన్న భూమిపై దేవాదాయ శాఖ అధికారులు దృష్టి సారించకపోవడంతో కొంతమంది అక్రమార్కులు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి, ఎండోమెంట్ ల్యాండ్ కు ఎసరు పెట్టి కబ్జాకు తెర లేపారు.. ఏదైనా నిర్మాణ పనులు చేయాలి అని అంటే ముందుగా భూమి నాలాకన్వర్షన్ చేసి నిర్మాణ అనుమతులకు పంచాయతీరాజ్ చట్టంలో చూపిన విధంగా పత్రాలు అన్ని సమర్పించి నిర్మాణ అనుమతులు పొందుతారు. అన్నది చట్టం చెబుతుంది..

కానీ ఇందుకు భిన్నంగా నెక్కొండ మండలంలో అవినీతి విలయతాండవం చేస్తూ అధికారులను తమ డబ్బుతో కొనుగోలు చేసి అక్రమంగా అనుమతులు పొందినట్లు డాక్యుమెంట్లను సృష్టించి దర్జాగా కమర్షియల్ నిర్మాణం చేసి మూడు పూవులు ఆరుకాయలన్న చందంగా అక్రమ వ్యవహారాలు కొనసాగిస్తున్నారు.. చర్చి పేరుతో కబ్జా చేసి, అక్రమంగా నిర్మించిన కమర్షియల్ షట్టర్లను దుర్మార్గపు ఆలోచనతో నిర్మించి లక్షల్లో దండుకుంటున్నా అధికారులు, హిందూ సంఘాలు, ప్రజా సంఘాలు నిర్జీవమైపోయి చోద్యం చూస్తున్నాయి..
ఇంత పెద్ద ఎత్తున దేవాదాయ శాఖ భూమిని చర్చి పేరుతో కబ్జా చేస్తుంటే ఎండోమెంట్ శాఖ అధికారులు ఏం చేస్తున్నారని మండిపడుతున్నారు పలువురు హిందూ సంఘాల నాయకులు.. ఇప్పటికైనా వరంగల్ జిల్లా పంచాయతీ శాఖ అధికారి స్పందించి అక్రమ నిర్మాణాలను తక్షణమే కూల్చివేసి దొడ్డి దారిన నకిలీ డాక్యుమెంట్లను సృష్టించిన వ్యక్తులపై పంచాయతీరాజ్ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పలువురు సామాజికవేత్తలు డిమాండ్ చేస్తున్నారు..

సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయ అధికారులే దేవాదాయ శాఖ భూమి అని తేల్చి చెప్పినా.. చర్చి పేరుతో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించిన ముఠా సభ్యుల పై, నెక్కొండ మండల తాహసిల్దార్ తోపాటు, ప్రస్తుత నర్సంపేట ఆర్డీవో ఉమారాణి, వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదను సైతం తప్పుదోవ పట్టించే పనిలో నిమగ్నమైనట్లు ఆరోపణలు సైతం బలంగా వినిపిస్తున్నాయి.. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించిన వ్యక్తుల పైన నేటికీ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు చేయక పోవడం, అక్రమంగా చేసిన నిర్మాణాలపై ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి..
ఇప్పటికైనా భూ పరిపాలన ప్రధాన కమిషనర్ ఇచ్చిన ఆదేశాలు తోపాటు ఎండోమెంట్ శాఖ అధికారులు ఇచ్చిన లేఖ ఆధారంగా చేసుకొని నెక్కొండ మండల తహసిల్దార్ కబ్జాదారులపై కఠిన చర్యలు చేపట్టాలని పలువురు హిందూ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.. దేవాదాయ శాఖ భూమిలో అక్రమ నిర్మాణాలు ఎలా వచ్చాయి..? తెర వెనుక చక్రం తిప్పింది ఎవరు..? పంచాయతీరాజ్ చట్టానికి విరుద్ధంగా నిర్మాణ అనుమతులు ఇచ్చింది ఎవరు..? భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయ లేఖను బేఖాతరు చేసి బోగస్ పత్రాలతో కబ్జాలు చేసే ముఠాకు పరోక్ష సహకారం అందించిన అధికారుల వ్యవహారంపై మరో కథనం ద్వారా వాస్తవాలు ఆధారాలతో వెలుగులోకి తేనుంది.
