Saturday, March 7, 2026
Homeవరంగల్‌DWCRA | ఇందిరా మహిళా (డ్వాక్రా) సంఘాల్లో "సీఏ"ల చేతివాటం!

DWCRA | ఇందిరా మహిళా (డ్వాక్రా) సంఘాల్లో “సీఏ”ల చేతివాటం!

  • మహిళా సంఘాలను నిలువునా ముంచుతున్న “సిఎ”లు!!
  • దోపిడి అంతా పై అధికారుల అండదండలతోటే.?
  • రుణం కావాల? అయితే తప్పనిసరి కమిషన్ ఇవ్వాల్సిందే!
  • ఒక్కొక్కటిగా బహిర్గతం అవుతున్న వారి “చేతి” వాటం
  • లక్ష లోనుకు వెయ్యి నుంచి మూడు వేలు వసూలు
  • లోలోన మధనపడుతున్న మహిళా సంఘాలు

ఇందిరా గ్రామీణ మహిళా సంఘాలలో “సిఏ”ల ఆధిపత్యం ములుగు జిల్లాలో ఆది నుంచి ఉన్నప్పటికీ ప్రస్తుతం మంగపేట మండలంలో భారీ స్థాయికి చేరి కొంతకాలంగా వారి “చేతి”వాటం తారాస్థాయికి చేరింది.గడచిన కొంత కాలనుంచి ఇక్కడ వారు చెప్పిందే వేదం, వారికి అనుకూలంగా నడవలేదా, వారు చేసే దోపిడీకి అడ్డుపడిన ఇక వారి సంఘానికి ఇక రుణాలు మంజూరు కానట్టే, ఆయా బ్యాంక్ అధికారులు కూడా వారికే వత్తాసు పలుకుతున్నారని పలు సంఘాలు ఆరోపిస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ మహిళలు అర్థికంగా అభివృద్ధి చెందండం ద్వారానే దేశ పురోగతి సాధ్యమని గుర్తించి మహిళలకు సాధికారితకు పెద్ద పీటలు వేశారు.

కొంతమంది మహిళా గ్రూపుగా ఏర్పడి ఒక సంఘంగా గుర్తింపుని ఇచ్చారు. అలా ఏర్పడిన మహిళా సంఘాలు గ్రామ సమాఖ్య సంఘాలుగా ముందుకు సాగుతున్నాయి. మహిళా సంఘాల తరపున వారు అభివృద్ధి చెందడానికి రుణాలను తీసుకున్న వారు సకాలంలో చేల్లిస్తున్నందున బ్యాంకు అధికారులు సైతం వీరికే పలు రకాల రుణాలు ఇవ్వడానికి సుముకుత చూపుతున్నారు. ప్రభుత్వం కూడా మహిళలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా పొదుపు సంఘాలలో చేరుతున్న మహిళలు పేదరికం నుంచి బయటపడేందుకు మార్గం సుగమం అవుతోంది.

- Advertisement -

అక్రమ “ఆర్ధిక” మార్గాన్ని ఎంచుకున్న సీఏలు.

మహిళా సంఘాల సంబంధించిన గ్రూపులపైన ఆ గ్రామానికి చెందిన సీవీలను ఏర్పాటు చేసి వారి ఆధ్వర్యంలో గ్రూపు బుక్కులు నిర్వహిస్తున్నారు. అందరి సమక్షంలో తీర్మానాలను రాసి సంఘాలు సజావుగా నడిపించాల్సిన బాధ్యత వారి పైన ఉంది. కానీ కొంతమంది నిర్వహికులు అక్రమ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ములుగు జిల్లాలోని మంగపేట,ఏటూరునాగారం, తాడ్వాయి, కన్నాయిగూడెం, వాజేడు లాంటి మండలంలో సిఏలు తమ “చేతి”వాటం ఇప్పటికే గట్టిగా నే ప్రదర్శిస్తున్నారు.

కొన్ని లక్షల రూపాయల వరకు దుర్వినియోగం జరిగినట్లుగా ప్రచారం సాగుతోంది. ఎక్కువ సంఖ్యలో నిరక్షరాస్యులు ఉండడంతో వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని తప్పుడు లెక్కలతో మోసం చేస్తున్నట్లు అర్థమవుతుంది. కొంతమంది మహిళా సంఘాలకు బ్యాంకుల నుంచి కొంత రుణం తీసుకొని కిస్తీల రూపంలో ప్రతినెల చెల్లిస్తున్నారు. అయితే కొంతమంది కిస్తీలు పూర్తిగా కట్టినప్పటికీ మరింత అప్పు ఉందంటూ పుస్తకాల్లో అప్పు ఉందంటూ చూపించడంతో మహిళలు కంగు తింటున్నారు.

శ్రీనిధి రుణాల చెల్లింపులో అవకతవకలు..

ఓ పక్క పొదుపు చేస్తూనే తీసుకున్న రుణాలతో స్వయం ఉపాధికి అడుగులు వేస్తూ కుటుంబ ఆర్థిక అభివృద్ధిలో మహిళలు భాగస్వాములవుతున్నారు. స్త్రీనిధి ద్వారా అందించే రుణాలతో స్వయం ఉపాది యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు. అయితే తీసుకున్న రుణాల చెల్లింపులో “గోల్మాల్ గోవిందా”అన్న చందం గా జరుగుతుందన్న విమర్శలు వినబడుతున్నాయి. ఒక లక్ష రూపాయల రుణం మంజూరు కావాలంటే కనీసం వెయ్యి నుంచి మూడు వేల వరకు వసూల్ సమాలు చేస్తున్నారంటున్నారు.

మండలాధికారుల కనుసన్నాలోనే ఈ తతంగమంతా అరుగుతున్నా వారు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని పలువురు మహిళలు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. అయితే మహిళా గ్రూపుకి సంబంధించిన అవినీతి అక్రమాలను బయట పెడితే ఎక్కడ తమకు రుణం మంజూరు చేయకుండా ఆపుతారేమో అని భయంతో కక్కలేక మింగలేక వారంతా లోలోపల మదన పడుతున్నారు.

ఇప్పటికైనా సంబంధిత అధికారులు,మండల అభివృద్ధి అధికారులు వెంటనే స్పందించి గ్రామాల్లో చిన్న, చిన్న కూలి వసులు చేసుకునే దినసరి కూలీలు, నిరాక్షరాశులయిన మహిళలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, రుణాల మంజూరు కోసం సి.ఏ లు ఇతర అధికారులు కమిషన్ తీసుకోకుండా రుణాల డబ్బులు అందిస్తే మంచిదని పలువురు మహిళలు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News