Friday, February 13, 2026
Homeమహబూబ్‌నగర్‌గుంటనక్కల భరతం పట్టండి… నిజాయితీపరులను గెలిపించండి.

గుంటనక్కల భరతం పట్టండి… నిజాయితీపరులను గెలిపించండి.

  • డి యూ డబ్ల్యూ జే వ్యవస్థాపక అధ్యక్షులు డి రవి ప్రసాద్..

వనపర్తి పట్టణ ప్రజలారా మున్సిపల్ స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మీ మీ వార్డులలో మానవతావాది, సామాజిక స్పృహ, ప్రజా సమస్యలపై పోరాడే చిత్తశుద్ధి కలిగిన వారు ఎవరైనా సరే వారికి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించుకోగలరని దళిత యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు డి రవి ప్రసాద్ పిలుపునిచ్చారు. ఈమధ్య విలువలు లేని రాజకీయ మనుగడ పరంపర కొనసాగుతా ఉందనీ .. ఒక పార్టీ సింబల్ పై గెలిచి.. గెలిపించిన ప్రజల మనోభావాలను దెబ్బతీసి గెలిచిన వ్యక్తి వారి స్వలాభాల కోసం ఇతర పార్టీలలో ప్యాకేజీలు మాట్లాడుకొని జంప్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు.

ప్రజాక్షేత్రంలో పనిచేయని వారు రెండు మూడు నెలల నుండి పగటి వేషాలు వేసి మిమ్ములను ప్రలోభపెట్టి ఎన్నడూ లేని ప్రేమను కనబరుస్తూ ఎన్నికల్లో గెలిచిన తర్వాత వారికి వత్తాసు పలికిన భజన గాళ్ళకు మాత్రమే పనులు చేస్తారనీ జోష్యం చెప్పారు. గెలిపించిన వారిని పక్కన పెట్టే ఇలాంటి గుంట నక్కల విషయంలో అప్రమత్తంగా ఉండి ప్రజాక్షేత్రంలో నిరంతరం శ్రమించే నిజాయితీపరులను గెలిపించుకుంటే మీ వార్డు, మీ ప్రాంత ప్రజలు అభివృద్ధి చెందుతారనీ పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News