డర్హమ్ తెలుగు క్లబ్(Durham Telugu Club).. ఫ్యామిలీ ఫెస్ట్(Family Fest)ను ఘనంగా నిర్వహించింది. కెనడా(Canada)లోని టొరంటో(Toronto)లో రీసెంట్‌గా జరిగిన ఈ కార్యక్రమానికి దాదాపు 800 తెలుగు కుటుంబాలు హాజరుకావటం విశేషం. కార్తీక మాస వన భోజనం (Karthika Masa Vana Bhojanam).. ఈ ప్రోగ్రామ్ కాన్సెప్ట్. దీనికి తగ్గట్లే రుచికరమైన వంటలు (Tasty Food Items) వడ్డించారు.
తేనీటి విందు (Tea Party) ఇచ్చారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కెనడాలోని తెలుగువారికి ఒకే వేదిక మీదికి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ ఈవెంట్ ఏర్పాటుచేశారు. ఇందులో భాగంగా పలువురికి అవార్డులను బహూకరించారు. గుత్తిరెడ్డి నరసింహారెడ్డి ఈ క్లబ్‌కి ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు. ఫ్యామిలీ ఫెస్ట్ విజయవంతం కావటం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
