సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్(Cyberabad Police Commissionerate) పరిధిలో వీకెండ్ స్పెషల్(Weekend Special) డ్రంక్ అండ్ డ్రైవ్(Drunk and Drive)లో భాగంగా విస్తృతంగా తనిఖీలు చేశారు. మొత్తం 231 మందిని అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశారు. వీరిలో 231 మంది ద్విచక్ర వాహనదారులు, 17 ఆటోలు, 47 కార్లు, 1 హెవీ వెహికల్ డ్రైవర్ ఉన్నారు. బ్లడ్ ఆల్కహాల్ కాన్‌సన్‌ట్రేషన్(BAC) ఆధారంగా కేసులను వర్గీకరించగా 259 మంది ఎంజీ/100 ఎంఎల్ నుంచి 200 ఎంజీ/100 ఎంఎల్ మధ్య, 26 మంది 201 ఎంజీ/100 ఎంఎల్ నుంచి 300 ఎంజీ/100 ఎంఎల్ మధ్య, 11 మంది 301 ఎంజీ/100 ఎంఎల్ నుంచి 550 ఎంజీ/100 ఎంఎల్ మధ్య ఆల్కహాల్(Alcohol) సేవించి పట్టుబడ్డారు. వీరందరినీ కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేయటం తీవ్ర నేరమని పునరుద్ఘాటించారు. మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదానికి కారణమైతే భారతీయ న్యాయ సంహిత–2023లోని సెక్షన్ 105(కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్) కింద కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఈ నేరానికి గరిష్ట శిక్ష 10 ఏళ్ల జైలు, జరిమానా విధించే అవకాశం ఉంది. గత వారం (19.01.2026–24.01.2026)లో మొత్తం 215 డ్రంక్ డ్రైవింగ్ కేసులను కోర్టులు పరిష్కరించాయి. వీరిలో ఐదుగురికి జరిమానా, జైలు శిక్ష, 8 మందికి జరిమానా, సోషల్ సర్వీస్, 202 మందికి జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు.
Cyberabad | 296 మందిపై డ్రంక్ & డ్రైవ్ కేసులు
- Advertisement -
RELATED ARTICLES
