విజయవాడవాసి పెద్ద మనసు
తిరుమల తిరుపతి దేవస్థానానికి (TTD) మరో భారీ విరాళం (Donation) అందింది. విజయవాడ(Vijayawada)కు చెందిన మోనిష్ వెంకట సత్యప్రకాష్ అనే భక్తుడు టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు(Anna Prasadam Trust)కు కోటి రూపాయలు విరాళంగా అందించారు. దాత తరఫున ఆయన ప్రతినిధి.. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు(BR Naidu)ను శుక్రవారం కలిసి విరాళానికి సంబంధించిన డీడీ(Demand Draft)ని అందించారు. ఈ సందర్భంగా నాయుడు.. దాతను అభినందించారు. మరో వైపు వేద విద్యార్థులకు టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి వస్త్రాలను (Clothes) పంపిణీ చేశారు.
- Advertisement -
