- నిర్మూలించడం ప్రతి పౌరుడి బాధ్యత.
- జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి..
బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమనీ, బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి పౌరులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ బాలికల పాఠశాలలో రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బాల్య వివాహ “ముక్త్ భారత్” కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బాల్యవివాహాల నిరోధక చట్టం 2006 ప్రకారం అమ్మాయిలకు 18 సంవత్సరాలు నిండకుండా పెళ్లి చేయడం నేరమని, బాల్య వివాహాల చట్టం ప్రకారం బాల్య వివాహాలను ప్రోత్సహిస్తే తల్లిదండ్రులపైనే కాకుండా వివాహానికి హాజరైన, ప్రోత్సహించిన వారు శిక్షకు అర్హులని పేర్కొన్నారు.

అమ్మాయిలను చదివిస్తూ జీవితంలో ఉన్నత స్థాయిలో స్థిరపడటానికి ప్రోత్సహిస్తూ వారినీ జీవితంలో స్థిరపడే దిశగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు. బాల్య వివాహాలకు సంబంధించి గత సంవత్సరంలో 36 మంది పై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశామని తెలిపారు. బాల్య వివాహాలు జరుగుతున్నట్లు కానీ చిన్నారుల పైన వేధింపులు గాని సమాచారం తెలిస్తే 1098 టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ కు కాల్ చేసి సమాచారం తెలియజేయాలని విద్యార్థులకు సూచించారు. నవంబర్ 27వ నుండి మార్చి 8 వరకు 100 రోజులపాటు ఈ క్యాంపెయిన్ నిర్వహించనున్నట్లు ఆర్డీఎస్ అధ్యక్షురాలు చిన్నమ్మ తామస్ తెలిపారు. ఈ సమావేశంలో డి ఆర్ డి ఓ ఉమాదేవి, జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి, డీఎంహెచ్o డాక్టర్ సాయినాథ్ రెడ్డి, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి రాంబాబు, ఆర్డీఎస్ ప్రతినిధులు, తహసిల్దార్ రమేష్ రెడ్డి ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

