Homeఆదిలాబాద్SKOCH | స్కోచ్ అవార్డులు అందుకున్న జిల్లా కలెక్టర్

SKOCH | స్కోచ్ అవార్డులు అందుకున్న జిల్లా కలెక్టర్

  • అభినందనలు తెలిపిన అధికారులు

ఇటీవలి డిల్లీ వేదికగా రెండు స్కోచ్ అవార్డులు అందుకున్న జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ కు పలువురు అధికారులు, మంగళవారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో అభినందించారు. పుష్పగుచ్చాలను అందించి, శాలువాలతో సన్మానించారు. పొనికివనం ఏర్పాటు, అమ్మరక్షిత కార్యక్రమాలను విజయవంతంలో ఎంతో కృషి చేశారని అధికారులు కొనియాడారు.

District Collector Abhilasha Abhinav SKOCH Awards

అమ్మరక్షిత కార్యక్రమం అమలులో కీలక భూమిక పోషించి, స్కోచ్ అవార్డు రావడంలో కృషి చేసిన జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి రాజేందర్ ను పలువురు అధికారులు శాలువాలతో సన్మానించారు. కలెక్టర్ ను అభినందించినవారిలో ఆర్డీఓ రత్నకళ్యాణి, సిపిఓ జీవరత్నం, డిఈఓ భోజన్న, ఈడి ఎస్సీ కార్పొరేషన్ శంకర్, డిపిఆర్ఓ విష్ణువర్ధన్, ఎస్సీ, మైనారిటీ సంక్షేమ శాఖల అధికారులు దయానంద్, మోహన్ సింగ్, ఇతర అధికారులు ఉన్నారు

- Advertisement -
RELATED ARTICLES

Latest News