Homeఆదిలాబాద్Retirement | ప్రతీ ఉద్యోగి జీవితంలో పదవీ విరమణ సహజం

Retirement | ప్రతీ ఉద్యోగి జీవితంలో పదవీ విరమణ సహజం

  • జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

ప్రతి ప్రభుత్వ ఉద్యోగి జీవితంలో పదవీ విరమణ సహజమని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. మంగళవారం రాత్రి కలెక్టర్ లోని సమావేశ మందిరంలో జిల్లా హౌసింగ్ పిడి గా బాధ్యతలు నిర్వర్తించి, ఈరోజు పదవీ విరమణ పొందిన రాజేశ్వర్, లోకేశ్వరం తహసిల్దార్ గా పని చేస్తూ పదవీ విరమణ పొందిన భోజన్న లకు పదవీ విరమణ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

District Collector Abhilasha Abhinav Retirement Felicitation0

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా గృహనిర్మాణ అధికారిగా రాజేశ్వర్, రెవెన్యూ శాఖకు భోజన్న లు చేసిన సేవలు గొప్పవని చెప్పారు. ఇరువురి పదవీ విరమణ అనంతర జీవితం సుఖశాంతులతో, కుటుంబ సభ్యులతో గడపాలని కాంక్షించారు. ఇరువురి పదవీ విరమణ ఆయా శాఖలకు తీరని లోటు అని తెలిపారు.

- Advertisement -

అంతకుముందు పలువురు అధికారులు, ఉద్యోగులు మాట్లాడుతూ, ఇరువురు వారి వారి శాఖలకు చేసిన సేవలు కొనియాడారు.
పదవీ విరమణ పొందిన అధికారుల దంపతులకు ఈ సందర్భంగా కలెక్టర్, అధికారులు శాలువాలతో సన్మానించారు. బహుమతులు అందించారు.

District Collector Abhilasha Abhinav Retirement Felicitation

ఈ పదవీ విరమణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లు వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆర్డీఓ రత్నకళ్యాణి, సిపిఓ జీవరత్నం, ఇతర అధికారులు, ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన వారి కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News