Monday, October 27, 2025
ePaper
Homeకరీంనగర్రేకుర్తిలో ఓ ఇంటి స్థల విషయంలో వివాదం

రేకుర్తిలో ఓ ఇంటి స్థల విషయంలో వివాదం

కరీంనగర్ రేకుర్తి 19వ డివిజన్ లోని సర్వే నెంబర్ 194 లో గల భూమిలో ఓ భూ వివాదం తలెత్తింది. తాను కొనుగోలు చేసిన భూమిలో వేరే వ్యక్తులు ఇంటి నిర్మాణం చేస్తున్నారని రేకుర్తికి చెందిన అంబాలా పుష్ప ఆరోపించారు. ఐదు సంవత్సరాల క్రితం రేకుర్తికీ చెందిన షౌకత్ వద్ద 100 గజాల భూమి కొనుగోలు చేసి రిజిస్టేషన్ చేసుకున్నట్లు ఆమె తెలిపారు.అంతే కాకుండా తమ చెల్లెలు కూడా 100 గజాలు కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఆ స్థలంలో ఇంటి నిర్మాణం సైతం చేసుకున్నట్లు చెప్పారు. ఇప్పుడు అదే స్థలంలో కొందరు వ్యక్తులు ఇంటి నిర్మాణ పనులు చేస్తున్నారన్నారు.

బాధితురాలు అంబాలా పుష్ప తనకు జరుగుతున్నా అన్యాయం పై మీడియతో మాట్లాడుతూ..ఈ సమస్య పై పోలీసులకు, మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు మీడియాకు తెలుపుతుండగా సాజిదా భాను అనే మహిళ తన కుటుంబ సభ్యులు తదితరులతో వచ్చి మీడియాతో మాట్లాడుతున్న పుష్పను ఆటంక పరుస్తూ ఈ భూమి తమది అని మాకు రేకుర్తి దొర బహుమతిగా తమకు ఇట్టి స్థలాన్ని ఇచ్చినట్లు చెబుతూ మీడియాతో మాట్లాడుతున్న పుష్పను ఆటంకపరిచారు దొర మాకు ఇచ్చిన భూమి మాది అని పుష్ప అక్రమంగా కొనుగోలు చేసినట్లు ఆధారాలు చూపుతుందని ఆరోపణలు చేశారు. దానికి సంబంధించిన దస్తావేజులు దొర దగ్గరనే ఉన్నట్లు చెప్పారు

RELATED ARTICLES
- Advertisment -

Latest News