- జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్.
ఈ నెల 11న నిర్వహించిన మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల విధులకు గైరహాజరైన 15 మంది ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఒక ప్రకటనలో తెలిపారు.తుంగతుర్తి మండలంలో 8 మంది, ఆత్మకూరు (ఎస్) మండలంలో 7 మంది ఉద్యోగులు మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల విధులకు గైర్హాజరయ్యారని, అందువల్ల వారిపై ఎన్నికల నిబంధనల ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
ఎన్నికలను సక్రమంగా నిర్వహించడంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వారికి కేటాయించిన విధులను నిర్వర్తించాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఎన్నికల విధులకు ఉత్తర్వులు అందుకున్న వారందరు తప్పనిసరిగా విధులకు హాజరుకావాలని ఆయన పునరుద్ధరించారు.
- Advertisement -
