Friday, October 3, 2025
ePaper
Homeజాతీయంఢిల్లీ సెక్రటేరియట్ సీజ్..

ఢిల్లీ సెక్రటేరియట్ సీజ్..

  • ఫైల్స్ బయటకు వెళ్ళకుండా గవర్నర్ జాగ్రత్తలు..!
  • అన్ని శాఖ‌ల‌కు వ‌ర్తిస్తాయ‌న్న జీడీఏ

ఢిల్లీ శాసనసభ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్‌కు అనుగుణంగానే వెలువడ్డాయి. అధికారం నిలబెట్టుకుని, నాలుగోసారి హ్యాట్రిక్ విజయం కోసం కేజ్రీవాల్ ప్రయత్నించగా, ఢిల్లీ ప్రజలు ఆయ‌న‌కు షాకిచ్చారు, కాషాయ పార్టీ 26 ఏళ్ల తర్వాత ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. ఆప్ ప‌రాభ‌వం త‌ర్వాతా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ సచివాలయాన్ని సీజ్‌ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముందస్తు అనుమతి లేకుండా ఫైళ్లు, రికార్డులను తొలగించొద్దని అన్ని విభాగాలకు ఆదేశాలు అందాయి. ఆయన సూచనల మేరకు.. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ ఉత్తర్వులు ఇచ్చింది. కాగా.. భద్రతాపరమైన సమస్యలు, రికార్డుల భద్రతను పరిరక్షించుకునేందుకు ఈ అభ్యర్థన చేశాం అని జీఏడీ పేర్కొంది. సచివాలయంలోని అన్ని శాఖల ఇంఛార్జిలు, సెక్రటేరియట్ కార్యాలయాలు, మంత్రుల క్యాంపు కార్యాలయాలకు ఈ ఉత్వర్వులు వర్తిస్తాయని, అన్ని రికార్డులను భద్రపరచడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టంచేసింది.

RELATED ARTICLES
- Advertisment -

Latest News