- ఢిల్లీ పేలుడు కేసులో కీలక మలుపు
- వెలుగులోకి వచ్చిన సీసీ టీవీ దృశ్యాలు
- ఎర్రకోట పేలుళ్లతో దేశవ్యాప్త కలకలం
- ఐ20 కారు ఆగిన కొన్ని క్షణాలకే భారీ పేలుడు
- ఆన్లైన్ ద్వారా పేలుళ్లకు ఉగ్ర సూచనలు
- ఎన్ఐఏకి కేసు బదిలీ
ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేలుడు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఫలితంగా దిల్లీ నగర హృదయంలో భయంకర దృశ్యం ఆవిష్కృతమైంది. నవంబర్ 10 న సాయంత్రం 6:50 గంటల సమయంలో ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 సమీపంలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద హ్యుందాయ్ ఐ20 కారు ఆగివుంది. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద మరికొన్ని వాహనాలు ఆగి ఉన్నాయి. సాధారణమైన ఆ రద్దీ క్షణాల్లో ఒక్కసారిగా భారీ శబ్దం వినిపించింది. ఒక్కసారిగా పేలిపోయింది హ్యుందాయ్ ఐ20 కారు ఒక్క క్షణంలోనే ముక్కలై ఎగిరిపోయింది. మంటలు చెలరేగి, చుట్టుపక్కల వాహనాలు, దుకాణాలు దెబ్బతిన్నాయి. ఆ దృశ్యం చూసి ప్రజలు ఒక్కసారిగా పరుగులు తీశారు.
క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోయిన వారు, గాయపడిన వారు నేల మీద పడ్డారు. ఆ రాత్రే దిల్లీ పోలీసులు, అగ్నిమాపక దళం, బాంబు నిర్వీర్య బృందం ఘటనా స్థలానికి చేరుకున్నారు. భద్రతా: సిబ్బంది మొత్తం ప్రాంతాన్ని ఖాళీ చేయించి ముట్టడించారు. అక్కడికక్కడే సీసీటీవీ కెమెరాల రికార్డులను సేకరించారు. రాత్రి 10 గంటలకల్లా ఘటనా స్థలంలోని వాహనాల మిగతా భాగా లు, ఇంధన శకలాలు, పేలుడు పదార్థాల ఆనవాళ్లను సేకరిం చారు. మొదటి ఫోరెన్సిక్ రిపోర్టు ప్రకారం… ఈ పేలుడు అధిక శక్తివంతమైన ఐఈడీతో జరిగినట్లు తేలింది. నవంబర్ 11 ఉదయం నుంచి దర్యాప్తు మలుపు తిరిగింది. పరిసర ప్రాంతాల సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించగా, ఐ20 కారు ముందురోజు సాయంత్రం నుంచే ఆ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు.
డ్రైవర్ సీట్లో ఎవరూ లేరని, కారు రిమోట్ ద్వారా పేల్చివేసినట్లు అధికారులు అనుమానించారు. సాంకేతిక ఆధారాలపై దర్యాప్తు సాగించగా, ఫరీదాబాద్లో ఉన్న డాక్టర్ ముజమ్మిల్ అనే వ్యక్తిపై అనుమానం కలిగింది. అతని ఫోన్ లొకేషన్ పేలుడు ప్రాంతా. నికి సమీపంగా ఉన్నట్లు తేలడంతో వెంటనే అతన్ని అరెస్ట్ చేశారు. ముజమ్మిల్ విచారణలో కొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దాడిని దీపావళి రోజునే జరపాలని ప్లాన్ చేసినట్లు, కానీ భద్రతా సిబ్బంది అప్రమత్తత కారణంగా దాన్ని వాయిదా వేశామని వెల్లడించాడు. అంతేకాకుండా ఈ దాడిని జనవరి 26, 2026 . గణతంత్ర దినోత్సవం నాటికి ప్రధాన దాడిగా అమలు చేయాలని ప్రణాళిక వేసుకున్నామని తెలిపాడు.
ఎర్రకోట పరిసర ప్రాంతాలను, రద్దీ ప్రదేశాలను ముందుగానే పరిశీలించామని, దీనికి పాక్ ఆధారిత జైషే మహ్మద్ ఉగ్ర ముఠా ఆర్థిక, సాంకేతిక సహాయం అందించిందని చెప్పినట్లు సమాచారం. నవంబర్ 12న ఎన్ఐఏ అధికారికంగా దర్యాప్తు చేపట్టింది. 10 మంది ఉన్న ప్రత్యేక బృందాన్ని నియమించింది. ఈ బృందం జమ్మూకశ్మీర్, హరియాణా, ఉత్తరప్రదేశ్ పోలీసు లు, ఇంటెలిజెన్స్ బ్యూరోతో కలిసి దర్యాప్తు ప్రారంభించింది. తొలి దశలోనే ముజమ్మిల్ ఇచ్చిన లీడ్స్ ఆధారంగా ఫరీదాబాద్, మీరట్, శ్రీనగర్ ప్రాంతా ల్లో సోదాలు జరిగాయి. ఈ సోదాల్లో పలు పేలుడు పదార్థాలు, ల్యాప్టాపులు, విదేశీ ఫండ్ లావా దేవీలకు సంబంధించిన ఆధారాలు స్వాధీనం అయ్యాయి.
దర్యా ప్తులో తరువాతి దశలో జమ్మూకశ్మీర్లోని పుల్వామా జిల్లాలో ఉగ్ర మాడ్యూల్ లింక్ బయటపడింది. అక్కడి భూగర్భ గోదా ములో 2,900 కిలోల పేలుడు పదార్థాలు… అమ్మోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్, సల్ఫర్ వంటి రసాయనాలు స్వాధీ నం అయ్యాయి. ఇది సాధారణ ఉగ్ర దాడి కోసం కాదు, ఒకే సారి దేశవ్యాప్తంగా పలు ప్రదేశాల్లో పేలుళ్ల కోసం సిద్ధం చేసిన నిల్వ అని అధికారులు వెల్లడించారు. దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ ఎర్రకోట పేలుడు ఒక పెద్ద కుట్రలో భాగమని తేలింది. ఈ మాడ్యూల్ లక్ష్యంగా ఎర్రకోట, ఇండియా గేట్, కాన్సిట్యూషన్ క్లబ్, గౌరీశంకర్ ఆలయం, ప్రధాన రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్ ఉన్నట్లు గుర్తించారు. వీరు 200 ఐఈడీలను తయారు చేయాలనే ఉద్దేశంతో పని చేస్తున్నారని, అందుకోసం ఆన్లైన్లో పదార్థాలు కొనుగోలు చేశారని తెలిసింది.
ఇంతలో మరో కోణం వెలుగులోకి వచ్చింది. అక్టోబర్ 29న ఐ20 కారును కొనుగోలు చేసిన వ్యక్తి డాక్టర్ సబీగా గుర్తించారు. ఆ కారు 11 రోజుల పాటు అండర్గ్రౌండ్లో దాచినట్లు ఆధారాలు లభించాయి. ముజమ్మిల్-నబీ లింక్పై దర్యాప్తు అధికారులు ఇప్పుడు దృష్టి సారించారు. ఈ ఇద్దరూ వైద్యులుగా ఉంటూ, దేశ వ్యాప్తంగా పనిచేస్తున్న మాడ్యూల్లో భాగమని ఎన్ఐఏ అనుమానిస్తోంది. ప్రస్తుతం ఎన్ఐఏ ఫోరెన్సిక్ ల్యాబ్లు సేకరించిన 40 నమూనాలను విశ్లేషిస్తోంది. వీటిలో అమ్మోనియం నైట్రేట్ ఆనవాళ్లతో పాటు, “ఆర్డీఎక్స్” లేదా జుమీ” వంటి అత్యంత శక్తివంతమైన సైనిక స్థాయి పేలుడు పదార్థాలున్న అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇది జరిగి ఉంటే దిల్లీ ఉగ్ర చరిత్రలోనే ఇది అతి పెద్ద కుట్రగా నిలుస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ ఘటన దేశ భద్రతా వ్యవస్థకు పెను హెచ్చరికగా మారింది.
ఎర్రకోట దాడి 26/11 ముంబయి దాడుల తరహా ప్రణాళికలో భాగమని స్పష్టమవుతోంది. దేశ రాజధాని హృదయంలో ఇంత సులభంగా కారు బాంబు పేలడమే ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీ పోలీసులు, ఎన్ఐఏలు ఇప్పుడు సాంకేతిక పర్యవేక్షణను పెంచి, ప్రతి ప్రధాన కట్టడంపై ప్రత్యేక నిఘా ఏర్పాటుచేశారు. ఈ పేలుడు కేవలం ఉగ్రదాడి మాత్రమే కాదు భవిష్యత్తులో పెద్ద కుట్రకు ముందుమాటగా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతు న్నారు.. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ముమ్మర దర్యాప్తు ద్వారా ఒకదానితో మరొకటి ముడిపడిన పలు ఉగ్ర మాడ్యూల్స్ బయటపడుతుండటంతో దేశ భద్రతా వ్యవస్థ మరోసారి అప్రమత్తమవుతోంది. ఈ ఘటన దేశం మొత్తానికి 26/11 ముంబయి దాడుల జ్ఞాపకాన్ని మరొకసారి గుర్తు చేసింది. ప్రతీ నిమిషం కొత్త ఆధారాలను వెతుకుతూ ఢిల్లీ పేలుడు కేసును దేశ భద్రతకు కీలక పరీక్షగా భావిస్తోంది ఎన్ఐఏ ..
