Tuesday, February 10, 2026
Homeమహబూబ్‌నగర్‌Deeksha Divas | కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం.

Deeksha Divas | కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం.

“దీక్షా దివాస్” సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రం లో మాజీ మంత్రి నివాసంలో బిఆర్ఎస్ వి వనపర్తి జిల్లా అధ్యక్షుడు హేమంత్ ఆధ్వర్యంలో విద్యార్థి నాయకులు, విద్యార్థులు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వి జిల్లా అధ్యక్షుడు హేమంత్ ముదిరాజ్ మాట్లాడుతూ.. పదహారేళ్ల క్రితం కేసీఆర్ మలీ దశ ఉద్యమాన్ని ఉధృతం చేసి దీక్ష పూనిన రోజును గుర్తుగా “దీక్ష దివాస్” ప్రతిఏటా నవంబర్ 29న నిర్వహిస్తామని పేర్కొన్నారు. 14 ఏళ్ల పోరాటం తో ప్రత్యేక తెలంగాణ సాధించి, పదేళ్ల కాలంలో సుపరిపాలన అందించి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి నీ దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలిపిన గొప్ప యోధుడు కేసీఆర్ అని కొనియాడారు.

ఆంధ్ర పాలకుల కుట్రలను తిప్పి కొట్టి తెలంగాణ ప్రజలను ఏకతాటిపైకి తెచ్చి సకల జనుల సమ్మెతో ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధింపచేసిన అపర చానిక్యుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని, రాబోయే కాలంలో అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వాకిటి శ్రీధర్, నందిమల్ల అశోక్, ప్రేమ్ నాథ్ రెడ్డి, కంచె రవి, నాగన్న యాదవ్, అవిసెట్టి భాగ్యరాజ్, సునీల్ వాల్మీకి, మంద రాము, ప్రేమ్ కుమార్, చంద్రశేఖర్, రామకృష్ణ, తోట శ్రీను, సిరివాటి శంకర్, ఎండి అలీం, ఎండి నావాజ్, శివ గౌడ్, కోమరి రాజు, అఖిల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News