Thursday, February 12, 2026
Homeరంగారెడ్డిCyberabad | మేడ్చల్ లో ఘనంగా సైబరాబాద్ పోలీస్

Cyberabad | మేడ్చల్ లో ఘనంగా సైబరాబాద్ పోలీస్

  • కమిషనరేట్ 24వ వార్షికోత్సవ వేడుకలు
  • కార్యక్రమంలో పాల్గొన్న:-ట్రాఫిక్ ఏసీపీ వెంకట్ రెడ్డి,సీఐ సత్యనారాయణ

సైబరాబాద్ పోలీసులు ప్రజలకు నాణ్యమైన, వేగవంతమైన సేవలందిస్తూ భద్రతా పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారని మేడ్చల్ ట్రాఫిక్ ఏసిపి వెంకట్ రెడ్డి తెలిపారు. గురువారం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ 24వ వార్షికోత్సవం సందర్భంగా మేడ్చల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. మేడ్చల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మేడ్చల్ ట్రాఫిక్ ఏసిపి వెంకట్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేసి అనంతరం కేకు కట్ చేసి వేడుకలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల శాంతి భద్రత పరిరక్షణలో సైబరాబాద్ పోలీసులు ఎల్లప్పుడూ ముందుండి సేవలు అందిస్తున్నారని తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో నేరాల నియంత్రణ ,ట్రాఫిక్ నిర్వహణ, సైబర్ క్రైమ్ పై కట్టడి ,మహిళలు మరియు వృద్ధుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. ప్రజల సహకారంతో రోడ్డు భద్రతపై అవగాహన పెంచుతూ ప్రమాదాలను తగ్గించడం లక్ష్యంగా పనిచేయాలని సిబ్బందికి సూచించారు.

- Advertisement -

మేడ్చల్ పోలీస్ స్టేషన్లో సీఐ సత్యనారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ సత్యనారాయణ మాట్లాడుతూ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఏర్పడి 24 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. శాంతి భద్రతల విషయంలో ప్రతి ఒక్కరూ నిక్కచ్చిగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ ట్రాఫిక్ సిఐ మధుసూదన్, మేడ్చల్ సిఐ సత్యనారాయణ, డి ఐ కిరణ్, ట్రాఫిక్ ఎస్ఐ పరశురాం, శ్రీనివాస్ ఎస్ఐ సురేష్, ట్రాఫిక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES

Latest News