- జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్.
- ఫోన్లో ఎవరూ డిజిటల్ అరెస్ట్ చేయరు.
- జిల్లా ఎస్పీ కె. నరసింహ.
సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. ప్రతి బుధవారం నిర్వహిస్తున్న “పోలీస్ ప్రజా భరోసా–సైబర్ జాగ్రత్త్ దివాస్”(Cyber Jaagrookta Diwas) కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రూపొందించిన సైబర్ అవగాహన పోస్టర్ను((Cyber Jaagrookta Diwas)) కలెక్టర్, ఎస్పీ కె. నరసింహతో కలిసి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ “ఆగండి.. ఆలోచించండి.. ధృవీకరించండి.. నిర్ణయం తీసుకోండి” అనే నినాదాన్ని ప్రజలు పాటించాలన్నారు. అనుమానాస్పద ఫోన్ కాల్స్, మెసేజ్లు, లింకులు, ఆన్లైన్ టాస్కులు, అధిక లాభాల పెట్టుబడి పథకాలను నమ్మవద్దని సూచించారు.
OTP, PIN, CVV, పాస్వర్డ్లను ఎవరికీ చెప్పవద్దని, వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలను సోషల్ మీడియాలో పంచుకోవద్దని తెలిపారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు కాల్ చేయాలని లేదా (cybercrime.gov.in) లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఎస్పీ కె. నరసింహ మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లు పోలీస్, సిబిఐ, సిఐడి తదితర సంస్థల పేర్లతో బెదిరింపులకు పాల్పడుతూ “డిజిటల్ అరెస్ట్” పేరుతో డబ్బులు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు.

డిజిటల్ అరెస్ట్ అనే విధానం లేదని, ఏ పోలీస్ లేదా ప్రభుత్వ అధికారి ఫోన్, వీడియో కాల్ ద్వారా బెదిరించి డబ్బులు అడగరని స్పష్టం చేశారు. ఆన్లైన్ ట్రేడింగ్, పెట్టుబడులు, టాస్కుల పేరుతో నకిలీ యాప్లు, వెబ్సైట్ల ద్వారా మోసాలు జరుగుతున్నాయని తెలిపారు. మోసానికి గురైన వెంటనే 1930కు ఫోన్ చేసి, ఫోన్ నంబర్లు, మెసేజ్లు, లింకులు, లావాదేవీ వివరాలు, స్క్రీన్షాట్లను భద్రపరచాలని సూచించారు. “గోల్డెన్ అవర్”లో ఫిర్యాదు చేస్తే నగదును నిలిపివేయడం లేదా రికవరీ చేసే అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఐఏఎస్ అనుషా, డీఎస్పీ ప్రసన్న కుమార్, పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, పోలీస్ అధికారులు, సైబర్ సెక్యూరిటీ సెల్ సిబ్బంది పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
