Tuesday, October 28, 2025
ePaper
Homeక్రైమ్ వార్తలురెచ్చిపోతున్న సైబర్‌నేరగాళ్లు

రెచ్చిపోతున్న సైబర్‌నేరగాళ్లు

ఎమ్మెల్యే వేముల వీరేశంకు న్యూ*డ్‌ వీడియో కాల్‌

డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌.. పోలీసులకు ఫిర్యాదు రాష్ట్రంలో సైబర్‌ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వేముల వీరేశంను టార్గెట్‌ చేసి న్యూడ్‌ కాల్స్‌తో బెదిరింపులకు దిగారు. న్యూడ్‌ వీడియో కాల్‌ను రికార్డు చేసి ఆయన మొబైల్‌కు పంపించడమే కాకుండా.. డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వివరాల ప్రకారం.. నకిరేకల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వేముల వీరేశంకు నిన్న రాత్రి సైబర్‌ నేరగాళ్లు వీడియో కాల్‌ చేశారు. ఆ కాల్‌ లిఫ్ట్‌ చేయగానే అవతలి అమ్మాయి నగ్నంగా కనిపించింది. మొబైల్‌ స్క్రీన్‌పై ఆ సీన్‌ చూడగానే వేముల వీరేశం ఫోన్‌ కట్‌ చేశాడు. కానీ అదంతా స్క్రీన్‌ రికార్డు చేసిన సైబర్‌ నేరగాళ్లు.. ఆ వీడియోను ఆయనకే పంపించారు. తమకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేదంటే ఆ వీడియోను కుటుంబసభ్యులు, మిత్రులకు పంపించడమే కాకుండా సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తామని వార్నింగ్‌ ఇచ్చారు. కానీ ఆయన స్పందించక పోవడంతో ఆ వీడియోను కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలకు పంపించారు. ఆ వీడియో చూసిన వెంటనే సదరు నేతలు, కార్యకర్తలు వేముల వీరేశానికి ఫోన్‌ చేసి ఆరా తీశారు. దీంతో కంగుతిన్న ఎమ్మెల్యే.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని కోరారు. పోలీసుల సలహాలతో సైబర్‌ నేరగాళ్ల నంబర్‌ను బ్లాక్‌ చేయాలని ఎమ్మెల్యేకు సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News