Wednesday, March 4, 2026
Homeహైదరాబాద్‌Naveen Yadav | మంత్రి తుమ్మలతో మర్యాదపూర్వక భేటీ

Naveen Yadav | మంత్రి తుమ్మలతో మర్యాదపూర్వక భేటీ

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే(JubileeHills Mla)గా గెలిచిన నవీన్ యాదవ్(Naveen Yadav).. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswar Rao)ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తుమ్మల.. నవీన్‌ యాదవ్‌కి శుభాకాంక్షలు (Wishes) తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి(Development), నియోజకవర్గ ప్రజా సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలు వంటి పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్బంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. ప్రజలకు మరింత సేవ చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. నవీన్ యాదవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ పెద్దల ఆశీర్వాదంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని అన్నారు. సమావేశంలో పలువురు స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News