Tuesday, February 10, 2026
Homeమహబూబ్‌నగర్‌Cotton | పత్తి పంటకు మద్దతు ధర చెల్లించి, దిగుమతి సుంకం ఎత్తివేయాలి

Cotton | పత్తి పంటకు మద్దతు ధర చెల్లించి, దిగుమతి సుంకం ఎత్తివేయాలి

  • స్లాట్ ద్వారా పత్తి కేవలం 7 క్వింటాలు కొనుగోలు నిబంధన ఎత్తివేయాలి.
  • మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి..

వనపర్తి: పత్తి పంటకు మద్దతు ధర చెల్లించి దిగుమతి సుంకం ఎత్తివేయాలని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగి రెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తీర్చాలని డిమాండ్ చేస్తూ మంగళవారం వెల్టూరు గ్రామంలో ని ఎస్ఎస్ వి కాటన్ మిల్లు దగ్గర రైతులు, బిఆర్ఎస్ నాయకులు తో కలిసి మాజీ మత్రి ధర్నా చేశారు . ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ.. స్లాట్ ద్వారా పత్తి కేవలం 7 క్వింటాళ్ల కొనుగోలు నిబం ధన ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల పత్తి పంట సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయి రోడ్లు ఎక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జిల్లా వ్యాప్తం గా 50 లక్షల ఎకరాలలో రైతులు పత్తి సాగు చేశార ని, అకస్మాత్తుగా సిసిఐ కేంద్రాలు, జిన్నింగ్ మిల్లు లు కొనుగోలు నిలిపివేయడంతో రైతులు పడిగాపు లు కాస్తున్నారని దుయ్యబట్టారు. బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు 8 మంది ఎంపీలు ఇద్దరు కేంద్ర మంత్రు లు ఉండి లాభం లేకపోయిందని, రైతులు మద్దతు ధర లేక, యూరియా దొరకక, బోనస్ లేక, రుణమా ఫీ కాక, కరెంటు కోతలతో హరిగోస పడుతుంటే ప్ర భుత్వం పట్టించుకోకుండా రాజకీయ ప్రయోజనాల తో రైతులను నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రంలో 12 క్వింటాలు కొనుగోలు చేస్తుంటే, కాపాస్ యాప్ ద్వారా తెలంగాణలో 7 క్వింటాళ్లు కొనడం ఏంటని ప్రశ్నించారు.

- Advertisement -

తక్షణమే సిసిఐ కేంద్రాలు, జిన్నింగ్ మిల్లుల మధ్య సమన్వ యం చేసి పత్తి కొనుగోలు ప్రారంభించాలనీ నిరం జన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమములో జిల్లా రైతు సమితి మాజీ అధ్యక్షులు జగదీశ్వర్ రె డ్డి, మాజీ జెడ్పిటిసి రఘుపతి రెడ్డి, జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్, మండల పార్టీ అధ్యక్షు లు వేణుయాదవ్, వనం రాములు, కె మాణిక్యం, సింగిల్ విండో అధ్యక్షులు రఘువర్ధన్ రెడ్డి, జితేంద ర్ రెడ్డి, పెద్దింటి వెంకటేష్, దిలీప్ రెడ్డి, ఎద్దుల సా యి కుమార్, తిరుపతి రెడ్డి, కుమార్ యాదవ్, వడ్డే రమేష్, ఖాజా గోరి, స్టార్ రహీమ్, జోహెబ్ హుస్సే న్, మహేశ్వర్ రెడ్డి, హారీఫ్ పాషా, చిట్యాల రాము, అంజి, మాజీ ప్రజాప్రతినిధులు, రైతులు తదితరు లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News