Thursday, February 12, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంCorruption | అవినీతిపై ఉక్కుపాదం

Corruption | అవినీతిపై ఉక్కుపాదం

ఆదాబ్ కథనానికి స్పందన..
వసూళ్ల రాణి ఏడీ కార్యాలయం నుంచి బర్కాస్
కలెక్టర్ నారాయణరెడ్డికి అభినందనలు!

అవినీతి అనేది సమాజాన్ని (Society) పట్టి పీడిస్తున్న ఒక మహమ్మారి(Pandemic). ప్రభుత్వ యంత్రాంగంలో కొందరు వ్యక్తులు తమ పదవులను అడ్డం పెట్టుకొని సాగిస్తున్న అక్రమాల(Irregularities)పై అక్షరాయుధంతో పోరాడాల్సిన బాధ్యత పత్రికా రంగానిది. సరిగ్గా ఈ బాధ్యతనే ‘ఆదాబ్ హైదరా బాద్’ దినపత్రిక అత్యంత ధైర్యంతో, నిబద్ధతతో నెరవేర్చింది. రంగారెడ్డి జిల్లా సర్వే, సెటిల్మెంట్స్, ల్యాండ్ రికార్డ్స్ కార్యాలయంలో తిష్టవేసిన అవినీతి అధికారుల నిర్వాకాలను ఆధారాలతో సహా వరుస కథనాల్లో బట్టబయలు చేసింది..

- Advertisement -

అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు(Assistant Director Srinivasulu), జూనియర్ అసిస్టెంట్ సునీత బాయ్(Junior Assistant Sunitha Boy).. ఈ ఇద్దరు అధికారులు సాగించిన అక్రమాలు, వందల కోట్ల విలువైన భూ రికార్డుల ‘వాటాల’ పంపిణీపై ‘ఆదాబ్ హైదరాబాద్’ వెలువరించిన కథనాలు కేవలం వార్తలుగా మిగిలిపోలేదు. అవి తూటాలై పేలాయి. ‘వసూళ్ల రాణి’, ‘అతిపెద్ద అవినీతి చిట్టా’ శీర్షికలతో ఆదాబ్ ప్రచురించిన సంచలన కథనాలకు ప్రభుత్వం, ఉన్నతాధికారుల నుంచి తక్షణ స్పందన వచ్చింది. కథనాలను పరిగణలోకి తీసుకున్న ఏసీబీ అధికారులు.. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులును కటకటాల్లోకి పంపారు.

అంతేకాకుండా.. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ (Rangareddy District Collector) సి.నారాయణరెడ్డి (C.NarayanaReddy) ఈ కథనాలకు తక్షణమే స్పందించి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జూనియర్ అసిస్టెంట్ సునీత బాయ్‌ని మాతృ శాఖకు తిరిగి అప్పగిస్తూ (Surrender) ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ తీసుకున్న ఈ తక్షణ చర్య.. పత్రికా స్ఫూర్తిని, ప్రజా సమస్యలపై వారికి ఉన్న చిత్తశుద్ధిని, అవినీతిపై ఉక్కుపాదం మోపాలనే వారి నిబద్ధతను స్పష్టం చేస్తోంది.

ఆదాబ్ హైదరాబాద్ రాసిన ప్రతి అక్షరం ముమ్మాటికీ అక్షర సత్యమే అని ప్రభుత్వ అధికారుల చర్యలు నిరూపించాయి. ఈ విజయం కేవలం పత్రికా రంగానిది కాదు. పారదర్శకతను కోరుకునే ప్రతి పౌరుడిదీ. అవినీతి అధికారుల్లో దడ పుట్టించిన ఈ సంచలనాత్మక కథనాలను, వాటి తదనంతర పరిణామాలను ‘ఆదాబ్ హైదరాబాద్’.. సమాజం దృష్టికి తీసుకొస్తూనే ఉంటుంది. మా అక్షరం అవినీతిపై అస్త్రం.

‘వసూళ్ల రాణి’, ‘అతిపెద్ద అవినీతి చిట్టా’ అంటూ ఆదాబ్ హైదరాబాద్ దినపత్రికలో ప్రచురించిన సంచలన కథనాలకు రంగారెడ్డి
జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి తక్షణమే స్పందించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సర్వే, ల్యాండ్ రికార్డ్స్ శాఖలోని జూనియర్ అసిస్టెంట్ ఎం.సునీత బాయ్‌ని వెంటనే కమిషనర్ అండ్ డైరెక్టర్, సర్వే, సెటిల్మెంట్స్, ల్యాండ్ రికార్డ్స్, తెలంగాణవారికి తిరిగి పంపుతూ (సరెండర్ చేస్తూ) ఉత్తర్వులు జారీ చేశారు.

ఆదాబ్ హైదరాబాద్ దినపత్రిక డిసెంబర్ 8, 9 తేదీల్లో ప్రచురించిన ప్రతికూల కథనాలను కలెక్టర్ నారాయణరెడ్డి సూచనప్రాయంగా పరిగణించారు. ఈ కథనాల్లో జూనియర్ అసిస్టెంట్ సునీత బాయ్, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ వ్యక్తి చంద్రకాంత్‌ను నియమించుకొని భూరికార్డులకు సంబంధించిన వందల కోట్ల విలువైన ‘వాటాలను’ పంపిణీ చేశారని, భూరికార్డుల ప్రాప్యతను అడ్డుకున్నారని తీవ్ర ఆరోపణలు వెలువడ్డాయి.

ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రంగారెడ్డి జిల్లా, సర్వే, సెటిల్మెంట్స్, ల్యాండ్ రికార్డ్స్ విభాగానికి చెందిన ఎం.సునీత బాయ్ సేవలను తదుపరి చర్యల నిమిత్తం మాతృ శాఖకు అప్పగిస్తూ (సరెండర్ చేస్తూ) ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాక, కార్యాలయ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు ఆమె స్థానంలో తగిన జూనియర్ అసిస్టెంట్‌ను వెంటనే నియమించాలని కమిషనర్ అండ్ డైరెక్టర్‌కు లేఖ ద్వారా ఆదేశించారు.

కలెక్టర్ చర్యపై ప్రశంసలు

ప్రజా సమస్యలను, పత్రికా కథనాలను తక్షణమే పరిగణనలోకి తీసుకొని, అవినీతి ఆరోపణలపై త్వరితగతిన చర్యలు తీసుకున్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి చిత్తశుద్ధిని, నిబద్ధతను ప్రజలు, మేధావులు, పత్రికా వర్గాలు ప్రశంసిస్తున్నాయి. అవినీతిపై ఉక్కుపాదం మోపడానికి ఆయన తీసుకున్న ఈ తక్షణ నిర్ణయం ప్రభుత్వ యంత్రాంగంలో పారదర్శకతను, జవాబుదారీతనాన్ని పెంచుతుందని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో తదుపరి దర్యాప్తు చేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News