బ్లడ్(Blood)లో గ్లూకోజు(Glucose) పెరిగితే సె*పై పురుషులకు మోజు(Interest) తగ్గుతుందని పరిశోధనలు(Research) సూచిస్తున్నాయి. ఇన్నాళ్లూ.. వయసు(Age) పెరగటం వల్ల, టెస్టోస్టిరాన్ హార్మోన్(Testosterone Hormone) తగ్గటం వల్ల ఇలా జరుగుతోంది అనుకున్నారు. కానీ.. తాజాగా.. గ్లూకోజ్ పెరగటం కూడా కారణమేనని అధ్యయనాలు వెల్లడించాయి. డయాబెటిస్(Diabetes)గా పేర్కొనే స్థాయిలో గ్లూకోజ్ పెరగకపోయినా కొంచెం ఎక్కువ పెరిగినా ఈ సమస్య తప్పదని హెచ్చరించాయి. రక్తంలో గ్లూకోజ్ పెరిగితే పురుష బీజ కణాలు వేగం తగ్గుతుందని, అంగస్తంభన కూడా వీక్ అవుతుందని పేర్కొన్నాయి. ఈ రెండూ జరిగితే సె* మీద ఇంట్రస్ట్ తగ్గినట్లేనని చెబుతున్నాయి. కాబట్టి ఎక్కువ కాలం సె*ను ఎంజాయ్ చేయాలంటే టెస్టోస్టిరాన్ హార్మోన్‌తోపాటు గ్లూకోజ్‌పైనా ఫోకస్ పెట్టాలని వెల్లడిస్తున్నాయి.

