- దిల్సుఖ్ నగర్ తపస్య డిగ్రీ కాలేజీలో కార్యక్రమం..
దిల్సుఖ్‌నగర్‌లోని తపస్య డిగ్రీ కాలేజీలో కన్జ్యూమర్ కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జన జాగృతి ఆధ్వర్యంలో వినియోగదారుల అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో తూనికలు-కొలతలు, ఆహార కల్తీ, సైబర్ సెక్యూరిటీ, వినియోగదారుల పరిరక్షణ చట్టం 2019 పై విద్యార్థులకు సమగ్ర అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమానికి సిసిఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మామిడి భీమ్ రెడ్డి, సిసిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సాంబరాజు చక్రపాణి,
డా. పల్లెపాడు దామోదర్, సిసిఐ రాష్ట్ర కార్యదర్శి అందె శ్రీధర్ రెడ్డి, జన జాగృతి ప్రధాన కార్యదర్శి ప్రవీణ్, జన జాగృతి మహిళా అధ్యక్షురాలు, తపస్య కాలేజీ ప్రిన్సిపాల్ త్రివేణి హాజరై విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు.
సాంబరాజు చక్రపాణి వినియోగదారుల పరిరక్షణ చట్టం 2019లో పేర్కొన్న ఆరు ముఖ్య హక్కులను వివరించారు:
- రక్షణ పొందే హక్కు.. 2. సమాచారం పొందే హక్కు.. 3. ఎంచుకునే హక్కు.. 4. వాయిస్ వినిపించే హక్కు.. 5. పరిష్కారం కోరే హక్కు.. 6. అవగాహన పొందే హక్కు..
అందె శ్రీధర్ రెడ్డి సైబర్ సెక్యూరిటీపై అవగాహన కల్పిస్తూ, నేటి సమాజంలో జరుగుతున్న వివిధ రకాల సైబర్ మోసాల గురించి వివరించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇలాంటి మోసాల నుండి ఎలా జాగ్రత్తగా ఉండాలో, భయాందోళనకు గురికాకుండా ఎలా స్పందించాలో సూచనలు ఇచ్చారు. డబ్బులు నష్టపోయిన సందర్భంలో వాటిని తిరిగి పొందడానికి తీసుకోవాల్సిన చర్యలను వివరించి, సైబర్ నేరాలపై ఫిర్యాదు చేయడానికి 1935 నంబర్‌కు కాల్ చేయాలని తెలియజేశారు.
డా. పల్లెపాడు దామోదర్ సమాజంలో వినియోగదారులను ఎలా మోసం చేస్తున్నారో ప్రాక్టికల్ ఉదాహరణలతో వివరించి, వినియోగదారుల కమిషన్ ద్వారా విధించే శిక్షలు, పరిష్కార విధానాలను వివరించారు. విద్యార్థులతో ప్రశ్నోత్తరాల రూపంలో ఇంటరాక్షన్ నిర్వహించి అవగాహన పెంపొందించారు.
తపస్య కాలేజీ ప్రిన్సిపాల్ త్రివేణి మాట్లాడుతూ, ఇలాంటి అవగాహన కార్యక్రమాలు విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమని, నేటి విద్యార్థులే రేపటి వ్యాపారవేత్తలు కావడంతో వారు నైతిక విలువలతో కూడిన వ్యాపార పద్ధతులు అనుసరించి నాణ్యత కలిగిన వస్తువులు, సేవలు అందించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమం విద్యార్థులలో వినియోగదారుల హక్కులపై చైతన్యం పెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషించింది..
