- మున్నేరు రిటైనింగ్వాల్ నిర్మాణం నాణ్యతతో పూర్తి చేయాలి
- భూనిర్వాసితులకు అందించే ప్రత్యామ్నాయాలపై అవగాహన కల్పించాలి
- అభివృద్ధి పనులపై సమీక్షించిన జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

మున్నేరు నదిపై చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని, ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ పూర్తి చేయడం పట్ల అధికారులు దృష్టిసారించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. నగరంలో జిల్లా కలెక్టర్ శు క్రవారం విస్తృతంగా పర్యటించారు. మున్నేరు నది రిటైనింగ్ వాల్ నిర్మాణం, కాల్వోడ్డు తీగల వంతెన పనులు, మున్నేరు భూనిర్వాసితుల కోసం ఏర్పాటు చేస్తున్న లేఔట్ వెంచర్ పురోగతి పనులను క్షేత్రస్థాయిలో కలెక్టర్ పరిశీలించారు.

అనంతరం రిటైనింగ్ వాల్రి భూ నిర్వాసితులకు ఇచ్చే ప్రత్యామ్నాయ భూమి లేఔట్ అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులతో సమీక్షించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిపుణుల కమిటీ చేసిన డిజైన్ల ప్రకారం మున్నేరు నది రిటైనింగ్ వాల్ నిర్మాణం పక్కాగా జరగాలని, సకాలంలో పూర్తయ్యేలా చూడాలన్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు కింద సేకరించిన భూములను అభివృద్ధి చేసి మున్నేరు నది రిటైనింగ్ వాల్ భూ నిర్వాసితులకు అందించేలా రైతులతో చర్చలు జరపాలని తెలిపారు.

రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తిస్థాయిలో నిర్మించాలని, రెండు వైపుల నుంచి ప్రణాళికాబద్ధంగా పని జరగాలన్నారు. రిటైనింగ్ వాల్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రాధాన్యతతో పూర్తి చేయాలని, ఏజెన్సీ అదనపు బృందాలు ఏర్పాటు చేసి పనులు చేయాలన్నారు. భూసేకరణ నిమిత్తం రైతులకు నిర్వాసితులకు అందించే 125 ఎకరాల ప్రత్యామ్నాయ భూముల లేఔట్ వెంచర్ అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని వెంచరు 100మీటర్ల ప్రధాన రహదారి, 40మీటర్ల చొప్పున అంతర్గత రహదారి, నగరంకు సులభతరం చేసే విధంగా అదనంగా ఓవర్ బ్రిడ్జి నిర్మాణం, ప్రత్యేకంగా వెంచర్ తో భూమి విలువ పెరిగి చుట్టుపక్కల విస్తృతంగా అభివృద్ధి జరుగుతుం దన్నారు.
మున్నేరుపై నిర్మించే కేబుల్ బ్రిడ్జి పనులు వేగవంతం గా జరుగుతున్నాయని, నిర్ణీత గడువులోపు ప్రజలకు అందు బాటులోకి తీసుకోని వచ్చే విధంగా నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. తీగల వంతెన నిర్మాణం వల్ల ఎవ్వరూ కూడా నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట ఆర్ & బి ఎస్ఇ యాకూబ్, ఇఇ పవార్, ఆర్డీఓ నర్సింహారావు, ఇరిగేషన్ డిఇ రమేష్రెడ్డి, ఖమ్మం అర్బన్, రూరల్ మండల తహశీల్దార్లు సైదులు, రాంప్రసాద్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
