Friday, March 6, 2026
Homeరంగారెడ్డిSuthariguda lake | సూతరిగుడా చెరువును కాపాడండి

Suthariguda lake | సూతరిగుడా చెరువును కాపాడండి

  • మేడ్చల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సుదాన్ష్ కు కాంగ్రెస్ నేతల వినతి….
  • సీఎంఆర్ కళాశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్..

సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ మరియు సీఎంఆర్ హాస్పిటల్ నుండి ఎలాంటి ఎస్టిపి (STP) ప్లాంట్ లేకుండా డ్రైనేజ్ మురుగు నీటిని నేరుగా సూతరిగుడా చెరువులోకి వదులుతున్న కళాశాల యాజమాన్యం పై కఠిన చర్యలు తీసుకోవాలని గుండ్లపోచంపల్లి కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. మంగళవారం గుండ్లపోచంపల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాయిపేట శ్రీనివాస్ అద్వర్యంలో సీఎంఆర్ కళాశాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మేడ్చల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సుదాన్ష్ కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం డివిజన్ అధ్యక్షుడు సాయిపేట శ్రీనివాస్ మాట్లాడుతూ సీఎంఆర్ కళాశాల, హాస్పిటల్ నుండి వదులుతున్న మురికినీటితో చెరువు నుండి వస్తున్న తీవ్ర దుర్వాసనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని, చెరువులోకి డ్రైనేజ్ నీరు కలవడంతో దోమలు, గుర్రం డెక్క విపరీతంగా పెరిగి డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి అనేక రోగాలతో గ్రామ ప్రజలు బాధపడుతున్నరని తెలిపారు.

అంతే కాకుండా చెరువునీరు కలుషితం అవడంతో చేపలు, పక్షులు, జంతువులు మృత్యువాత పడుతున్నారని దింతో చేరువుపై ఆధారపడి జీవనం సాగిస్తున్న మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ఈ సమస్యపై తక్షణమే చర్యలు తీసుకుని డ్రైనేజ్ నీటిని చెరువులోకి వదలకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ డిప్యూటీ కమిషనర్ కు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో గుండ్లపోచంపల్లి ఓపిసిఎల్ చైర్మన్ రవి ముదిరాజ్, మాజీ సర్పంచిలు మాజీ సర్పంచ్ సురేందర్ ముదిరాజ్, సాకారబోయిన మల్లేష్ ముదిరాజ్ (వర్కింగ్ ప్రెసిడెంట్), రాజేందర్, చిల్ల వెంకటేశ్, సాయిపేట మల్లేష్, వినోద్, కావలి భాస్కర్, కుండ భాను, మాధవ్ రెడ్డి, శ్రీనివాస్, శ్రీకాంత్ ముదిరాజ్, శివ ముదిరాజ్, కిషన్, సాయికుమార్, హర్షత్, షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News