Homeరంగారెడ్డిAwareness | సురక్షితమైన డ్రైవింగ్ తో విలువైన ప్రాణాలను కాపాడుకోండి

Awareness | సురక్షితమైన డ్రైవింగ్ తో విలువైన ప్రాణాలను కాపాడుకోండి

  • ఏసిపి కృష్ణయ్య

సురక్షితమైన డ్రైవింగ్ తో విలువైన ప్రాణాలను కాపాడుకోవాలనిఎల్బీనగర్  ఏసిపి కృష్ణయ్య పేర్కొన్నారు. కొత్తపేట డివిజన్ మారుతి నగర్ కమ్యూనిటీ హాల్లో చైతన్యపురి పోలీస్ ల ఆధ్వర్యంలోసమగ్రత రోడ్డు భద్రత (అరైవ్-అలైవ్ రోడ్ సేఫ్టీ అవేర్ నెస్ ప్రోగ్రాం 2026) అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ పోలీసులు శాఖ నిర్వహిస్తున్న మాసోత్సవాలలో భాగంగా ప్రజలకు రోడ్డు భద్రత పై సమగ్రమైన డ్రైవింగ్ భద్రతపై అవగాహన కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. వేగం కంటే ప్రాణం, కుటుంబం ముఖ్యమని ఆయన తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు సరిగ్గా పాటిస్తే సురక్షితంగా నా ప్రాణాలతో ఇంటికి చేరగలమని ఆయన పేర్కొన్నారు.

ACP Krishnaiah on Road Safety

సీఐ సైదులు మాట్లాడుతూ సురక్షితంగా డ్రైవింగ్ చేస్తూ గమ్యం చేరాల తప్ప అతివేగంగా డ్రైవింగ్ చేసి అగమ్య గోచరంగా కుటుంబాన్ని విచ్చిన్నం చేయకూడదని ఆయన అన్నారు. చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు భద్రత పై ట్రాఫిక్ నిబంధనలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తున్నామని ఆయన అన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో ఆర్.టి.ఏ ఇన్స్పెక్టర్ షేక్ మున్ని, ట్రాఫిక్ సీఐ వెంకటేశ్వర్లు, డాక్టర్ తిమ్మారెడ్డి, అడ్మిన్ ఎస్ఐ భద్రయ్య చైతన్యపురి పోలీస్ స్టేషన్ సిబ్బంది ప్రజలు, యువతీ, యువకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News