- ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి వెల్లడి.
మంగళవారం ఉదయం ఇబ్రహీంపట్నం మార్కెట్ యార్డులో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం డివిజన్ రైతులకు సబ్సిడీ కింద మంజూరు చేసిన వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలను పంపిణీ చేసిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి.
ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం తెలంగాణ రైతులను ఆర్థికంగా మోసం చేసిందని,సబ్సీడీ కింద రైతులకు అన్యాయం జరిగిందని మండిపడ్డారు.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రేస్ పార్టీ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక కాలంలో రైతులకు రుణమాఫీ చేశామని, సన్నవడ్లకు 500/- బోనస్ ఇచ్చి రైతులను ఆదుకున్నామని చెప్పారు. కాంగ్రేస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసమే పని చేస్తుందని చెప్పారు. రైతును రాజు గా చూడాలని కోరారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లో రైతులు రైతు కూలీలను ఆదుకుంటామని, రైతులు ఎక్కువగా ఉపయోగించే పరికరాలను అధికారులు సబ్సిడీ ఇవ్వాలని ఆదేశించారు. వ్యవసాయo అంటే ఒక పండుగ లాంటిదని, రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర అందిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు సుజాత,పద్మజ,మార్కెట్ కమిటీ చైర్మన్ లు చిలుక మధుసూదన్ రెడ్డి,గురునాథ్ రెడ్డి, వైస్ చైర్మన్ Ch.భాస్కర చారి, వివిధ గ్రామాల సర్పంచ్ లు, మార్కెట్ కమిటీల డైరక్టర్లు,డివిజన్ కి సంబంధించిన వ్యవసాయ శాఖ అధికారులు,కాంగ్రేస్ పార్టీ మాజీ ప్రజా ప్రతినిధులు,సీనియర్ నాయకులు,రైతులు పాల్గొన్నారు.

