కరీంనగర్, నవంబర్ 14 (ఆదాబ్ హైదరాబాద్): జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(JubileeHills Bye Election)లో కాంగ్రెస్ అభ్యర్థి (Congress Candidate) నవీన్ యాదవ్ (Naveen Yadav) ఘన విజయం సాధించడంపై మానకొండూర్ నియోజవకవర్గంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబురాలు (Celebrations) జరుపుకున్నారు. ఎల్ఎండీ కాలనీలో ప్రజాభవన్ (Prajabhavan) వద్ద ఎమ్మెల్యే (Mla) డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ (Kavvampalli Satyanarayana) ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి సంబురాలు జరుపుకున్నారు. స్వీట్లు, మిఠాయిలు పంపిణీ చేశారు. కేరింతలు కొడుతూ నృత్యాలు చేశారు. ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి కూడా స్టెప్పులు వేసి పార్టీ శ్రేణులను మరింత ఉత్సాహపర్చారు. మానకొండూరు మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నందగిరి రవీంద్రచారి ఆధ్వర్యంలో కార్యకర్తలు సంబురాలు జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు బాణసంచా పేల్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మర్రి ఓదెలు యాదవ్, వైస్ చైర్మన్ ఆర్.తిరుమల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సంపత్ గౌడ్, ద్యావ శ్రీనివాస్ రెడ్డి, బండి మల్లేశం, ఆర్.తిరుపతి, తాళ్లపల్లి నరేశ్, మడుపు ప్రేమ్ కుమార్, వాల అంజిత్ రావు, బోళ్ల మురళీధర్, కనకం కుమార్, కోండ్ర సురేష్, ఇర్ఫాన్, రాకేష్, సహదేవ్, దూలం దేవేంద్ర, రొంటాల లక్ష్మారెడ్డి, గొల్లెన కొమురయ్య, సాయిరి దేవయ్య, శ్రీనివాస్ గౌడ్, చెలికాని సదయ్య, మీస సత్యనారాయణ, వరహాల చారి, బుర్ర శ్రీకాంత్, ఎన్.బాపురావు, గుజ్జె ప్రభాకర్, మహేందర్, బుర్ర చంద్రాకర్, గోపు మల్లారెడ్డి, మోరపల్లి రమణారెడ్డి, తుమ్మనపల్లి శ్రీనివాస్ రావు, శ్రీగిరి రంగారావు, గంకిడి లక్ష్మారెడ్డి, పులి కృష్ణ, సాదిక్, బండి మల్లేశం, ద్యావ శ్రీనివాస్ రెడ్డి, పోతుగంటి శ్రీనివాస్,ఆశిక్ పాషాతోపాటు వివిధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
