చేవెళ్ల బస్సు ప్రమాద మృతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana State Government) రూ.5 లక్షల పరిహారం (Compensation) ప్రకటించింది. ఆర్టీసీ (Rtc) రూ.2 లక్షలు ఇవ్వనుంది. క్షతగాత్రులకు ప్రభుత్వం రూ.2 లక్షలు అందజేయనుంది. ఈ విషయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) వెల్లడించారు. బస్సు ప్రమాద బాధితులను పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కాలేజీలో పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మృతదేహాలకు చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహణపై అధికారులతో మాట్లాడారు. ఎప్పటికప్పుడు ఆర్టీసీ, పోలీస్, వైద్య శాఖ అధికారులతో మాట్లాడుతూ సమన్వయం చేస్తున్నారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
- Advertisement -
