జిల్లా కలెక్టర్ కె. హైమావతి(k.Hymavathi) ఆకస్మికంగా కుకునూరుపల్లి మండల(Kukunoorpally mandal) కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను(ZPHS) సందర్శించి మధ్యాహ్న భోజన(mid day meal) ప్రక్రియను స్వయంగా పరిశీలించారు(inspected). వంటగదిలో వండిన ఆహార పదార్థాలు ఆలుగడ్డ టమాటా పప్పు, బిర్యానీ రైస్ మెనూ ప్రకారం వండినట్లు వంటసిబ్బంది వివరించగా, కలెక్టర్(collector) స్వయంగా నాణ్యతను పరిశీలించారు.
భోజన పదార్థాల రుచి, నాణ్యతపై కలెక్టర్ హైమావతి ఆగ్రహం వ్యక్తం చేస్తూ పిల్లలకు రుచికరంగా, శుభ్రంగా వండండి. బిర్యానీ కూరల్లో నాణ్యత పెంచండి” అని వంట సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. పాఠశాల పరిశుభ్రతపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్, “వరండాల్లో చెత్త కనిపించకూడదు, పాఠశాల ప్రాంగణం శుభ్రంగా(clean) ఉండాలి. ఇంత అపరిశుభ్రత అంటే డ్యూటీ చేస్తున్నారనే అర్థమా?” అంటూ ప్రిన్సిపల్, స్కావెంజర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

వెంటనే డీఈఓకు ఫోన్ చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తదుపరి కొండపాక మండలంలోని తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కూడా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. వంటగదిలో బిర్యానీ రైస్, ఆలుగడ్డ టమాటా కూర పరిశీలించిన ఆమె, విద్యార్థుల హాజరు, వంట సరుకుల సరఫరా సక్రమంగా ఉందా అని వివరాలు తెలుసుకున్నారు.
“పిల్లలు బాగా తినాలి, శారీరకంగా బలంగా ఉండాలి అప్పుడు మానసికంగా ఆరోగ్యంగా ఎదుగుతారు” అని విద్యార్థులకు సూచించారు. “అన్నం వృథా చేయకండి, ఇది పరబ్రహ్మ స్వరూపం” అని చెప్పారు. తరువాత పాఠశాల ప్రాంగణంలోని అంగన్వాడీ కేంద్రాన్ని కూడా సందర్శించి పిల్లలకు పౌష్టికాహారం, స్నాక్స్, బాలమృతం తదితరాలు సమయానికి అందించాలని సిబ్బందిని ఆదేశించారు. బాలింతలు, చిన్నారుల పౌష్టికాహారం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని హెచ్చరించారు.
