కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరులో బస్సు ప్రమాదం (Kurnool Bus Accident) జరిగిన స్థలాన్ని జోగుళాంబ గద్వాల్ జిల్లా (Jogulamba Gadwal District) కలెక్టర్ బి.యం.సంతోష్ (Collector BM Santhosh), జిల్లా ఎస్పీ (Sp) శ్రీనివాసరావు పరిశీలించి బాధితులను పరామర్శించారు. ప్రమాదంపై సంబంధిత అధికారులతో చర్చించి సహాయక చర్యలను వేగవంతం చేయటానికి అన్ని చర్యలు తీసుకుంటున్నారు. బాధిత కుటుంబాలకు అవసరమైన అన్ని సహాయాలు అందించేందుకు కర్నూలు జిల్లా యంత్రాంగంతో కలిసి జోగులాంబ గద్వాల జిల్లా యంత్రాంగం కృషి చేస్తోంది. బస్సు ప్రమాదంలో చిక్కుకున్న ప్రయాణికుల కుటుంబ సభ్యులకు అవసరమైన సాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం అధికారులతో హెల్ప్‌లైన్ (సహాయ కేంద్రం) ఏర్పాటుచేసింది.
ఆ వివరాలు..
శ్రీరామచంద్ర, అసిస్టెంట్ సెక్రటరీ 9912919545
చిట్టిబాబు, సెక్షన్ ఆఫీసర్ 9440854433
ఈ నేపథ్యంలో జోగుళాంబ గద్వాల్ జిల్లా కలెక్టరేట్‌లో, పోలీసు కంట్రోల్ రూమ్‌లో హెల్ప్ లైన్ (Help Line) ఏర్పాటుచేశారు. సమాచారం కోసం బాధిత కుటుంబాలు కింది నంబర్‌కు సంప్రదించవచ్చు.
గద్వాల్ పోలీస్ ఆఫీసు కంట్రోల్ రూమ్ నం. 8712661828
గద్వాల్ కలెక్టరేట్ లోని కంట్రోల్ నంబర్ 9502271122
కలెక్టరేట్ లోని హెల్ప్ డెస్క్ నంబర్ 9100901599, 9100901598
కర్నూల్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి కంట్రోల్ రూమ్ నంబర్ 9100901604
