హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్(Hyderabad Metro Rail Phase)-II మంజూరు కోసం రాష్ట్ర ప్రభుత్వం(State Government) కేంద్ర ప్రభుత్వం(Union Government)తో నిరంతరం సంప్రదింపులు(Constant contact) జరుపుతోందని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తెలిపారు. కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి(Union Minister for Housing and Urban Affairs) మనోహర్‌లాల్ ఖట్టర్(Manohar Lal Khattar)తో జరిగిన సమావేశం మేరకు మెట్రో ఫేజ్-II కోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేస్తున్నామని చెప్పారు. ఈ మేరకు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి(Union Minister of Coal and Mines) కిషన్ రెడ్డి(KishanReddy)కి లేఖ రాశారు.
- హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-II నిర్మాణం కోసం కేంద్రం నుంచి ఇద్దరు అధికారులతో కూడిన సంయుక్త కమిటీలో చేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇద్దరు అధికారులను నామినేట్ చేసేందుకు వేచిచూస్తున్నామని కిషన్ రెడ్డి ఈ నెల 15న రాసిన లేఖలో పేర్కొన్న అంశాలను ప్రస్తావిస్తూ సంబంధిత వివరాలను కూడా సీఎం రేవంత్ తన లేఖలో పేర్కొన్నారు.
- కమిటీ కూర్పునకు సంబంధించిన వివరాలను ఇప్పటికే కేంద్ర పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు తెలిపామని వెల్లడించారు. మెట్రో రైల్ ఫేజ్-II మంజూరు కోసం నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే ఉన్నామని పునరుద్ఘాటించారు. ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న ఫేజ్-II ప్రాజెక్టును తన పలుకుబడితో వీలైనంత తొందరగా ఆమోదింపజేయాలని సీఎం రేవంత్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాసిన లేఖలో కోరారు.
- Advertisement -
