Wednesday, March 4, 2026
HomeతెలంగాణCM Revanth Reddy | ‘గ్లోబల్ సమ్మిట్‌’పై సమీక్ష

CM Revanth Reddy | ‘గ్లోబల్ సమ్మిట్‌’పై సమీక్ష

డిసెంబర్ 8, 9 తేదీల్లో ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ (Telangana Rising Global Summit) 2025 కోసం ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి ప్రతినిధులు పెద్దఎత్తున హాజరవుతున్న ఈ అంతర్జాతీయ సదస్సుపై సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించబోయే ఈ సదస్సుతో పాటు రాష్ట్రానికి అత్యంత కీలకమైన దార్శనిక పత్రం తెలంగాణ రైజింగ్ 2047 (Telangana Rising 2047) డాక్యుమెంట్ (Document) విడుదల చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో సీఎం వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ రోజు నుంచి నవంబర్ 30 వరకు కమాండ్ కంట్రోల్ సెంటర్(ICCC)లో ఈ అంశాలపై సమావేశాలను నిర్వహిస్తూ గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ, 2047 నాటికి తెలంగాణ భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించిన తెలంగాణ రైజింగ్ దార్శనిక పత్రంపై తుది మెరుగులు దిద్దనున్నారు.

  • ఈ వరుస సమావేశాల్లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబుతోపాటు అంశాల వారీగా జరిగే సమీక్షల్లో సంబంధిత మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొంటారు.
  • నవంబర్ 25: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ (ఈ భేటీ ఇవాళ జరిగింది)
  • నవంబర్‌ 26: లాజిస్టిక్స్‌, సమ్మిట్ ఏర్పాట్లు
  • నవంబర్‌ 27: మౌలిక వసతులు, అభివృద్ధి(పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ, రవాణా, రోడ్లు-భవనాలు, ఆర్థిక, విద్యుత్, గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణం, మున్సిపల్ వ్యవహారాలు)
  • నవంబర్‌ 28: విద్య, యువజన సంక్షేమం, (క్రీడలు, నైపుణ్యత, టూరిజం, దేవాదాయ శాఖ)
  • నవంబర్‌ 29: వ్యవసాయం, అనుబంధ విభాగాలు, సంక్షేమం (బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ)
  • నవంబర్ 30 : ఆరోగ్యం, వైద్య, కుటుంబ సంక్షేమం
- Advertisement -
RELATED ARTICLES

Latest News