నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్ గ్రామంలో సదర్మట్ బ్యారేజ్(Sadarmat Barrage)ని సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. తద్వారా.. యాసంగి పంటకు నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎంపీ నగేష్‌తోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. దీంతోపాటు ఆదిలాబాద్ జిల్లా భోరాజ్ మండలం హతిఘాట్‌లో చనాక-కొరాటా బ్యారేజ్ పంప్‌హౌస్ (Chanaka-Korata Barrage Pumphouse)ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. తద్వారా.. లోయర్ పెనుగంగ్ ప్రాజెక్ట్ ప్రధాన కాలువ(Lower Penugang Project Main Canal)కు నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి, లోక్‌సభ సభ్యుడు గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. సదర్మాట్ బ్యారేజీ ప్రారంభోత్సవం అనంతరం నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో బహిరంగ సభలో పాల్గొన్నారు.
CM Revanth | బ్యారేజ్, పంప్‌హౌజ్‌ల ప్రారంభం
By Aadab Desk
- Advertisement -
Previous article
Next article

