- పదవ తరగతి పరీక్షలపై విద్యాశాఖ షెడ్యూల్..
- ఈ నిర్ణయంపై వెల్లువెత్తిన విమర్శలు..
- నష్టనివారణ చర్యలకు ఉపక్రమించిన పాఠశాల విద్యాశాఖ..
మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం ఒక్కో పరీక్షకు మూడు నుంచి ఐదు రోజుల వ్యవధి ఉండడంతో ఈ గ్యాప్ విద్యార్థులకు నష్టం కలిగిస్తుందన్న భావనకు వచ్చింది. ఆలస్యంగా మేల్కొని ఎట్టకేలకు నష్టనివారణ చర్యలకు ఉపక్రమించింది. గ్యాప్‌లో విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయాలని నిర్ణయించింది. సీబీఎస్‌ఈ తరహాలో పదో తరగతి పరీక్షల్లోనూ వ్యవధి ఇవ్వాలన్న ఆలోచనతో విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది.
ఓ ఉన్నతాధికారికి హఠాత్తుగా వచ్చిన ఆలోచనను అమలుచేసింది. దీనిని టీచర్ ఎమ్మెల్సీలు సహా ఉపాధ్యాయ సంఘాలన్నీ వ్యతిరేకించాయి. ఈ వ్యవధిలో విద్యార్థులు ప్రిపరేషన్ మానేసి ఆటలు, ఫోన్లు, టీవీలకు అలవాటు పడితే అసలుకే మోసం వస్తుందని ఆందోళన వ్యక్తంచేశాయి. ఇదే విషయాన్ని విద్యాశాఖ ఉన్నతాధికారులకు వివరించాయి. షెడ్యూల్ మార్చకుండ ఇప్పుడు నష్టనివారణ చర్యల్లో భాగంగా యాక్షన్ ప్లాన్ ప్రకటించింది.
