మేడ్చల్ డిపో లో శుక్రవారం జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల కార్యక్రమం అట్ట హాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ సి ఐ సత్యనారాయణ హాజరయ్యారు, ఈ సందర్భంగా డిపో మేనేజర్ పరిమళ ఆయనను శాలువతో సన్మానించి పులా బొకే అందజేశారు, అనంతరం సి ఐ మాట్లాడుతూ డ్రైవర్లు, కండక్టర్లు తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు ప్రమాదాలు నివారించుట గురించి వివరించారు,ఈ కార్య్రమంలో మేడ్చల్ డిపో మేనేజర్. కె. పరిమళ, అసిస్టెంట్ మేనేజర్.జి.రామారావు, అసిస్టెంట్ ఇంజనీరు. వి.స్నేహలత, ఆఫీసు సూపరింటెండెంట్, పి.ఎస్.ఎన్ రావు, డిపో సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -
